ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్‌పై కోపాన్ని.. ఆయన మైనపు బొమ్మపై తీర్చుకుంటున్నారు !

ABN, First Publish Date - 2021-03-20T18:56:00+05:30

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎంతమంది అమెరికన్లు అభిమానిస్తారో.. అంతేమంది ద్వేషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాన్ ఆంటోనియో, టెక్సాస్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎంతమంది అమెరికన్లు అభిమానిస్తారో.. అంతేమంది ద్వేషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మాటలకు అధ్యక్షుడే గానీ, ఎప్పుడు ఆ పదవికి గౌరవం తెచ్చేలా హుందాగా మెలగలేదనేది చాలా మంది అభిప్రాయం. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన టెంపరీతనంతో ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నారో, అంతేమంది విరోధులను కూడా కూడగట్టుకున్నారు ట్రంప్. ఇప్పటికీ ఆయనపై కొందరు అమెరికన్లకు ఇంకా కోపం తగ్గలేదు. అందుకే టెక్సాస్​లోని శాన్ ఆంటోనియోలో ఉన్న లూయిస్​ టుస్సాడ్స్​ వ్యాక్స్​వర్క్స్​లోని ట్రంప్ మైనపు​ విగ్రహంపై అక్కడికి వచ్చే కొందరు పంచ్‌ల వర్షం కురిపిస్తున్నారట.


ప్రధానంగా ఆయన మొహంపై పిడిగుద్దులతో విరుచుకుపడుతున్నారట. దాంతో చేసేదేమిలేక ట్రంప్​ మైనపు బొమ్మను నిర్వాహకులు వేరే చోటకు తరలించారు. ఈ విషయాన్ని లూయిస్​ టుస్సాడ్స్​ వర్క్స్​ను నిర్వహించే రిప్లే ఎంటర్​టైన్​మెంట్స్​ ప్రాంతీయ మేనేజర్ క్లే స్టీవర్ట్ వెల్లడించారు. గతంలో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్​ వాషింగ్టన్ బుష్​ విగ్రహాలపై సైతం ఇలాంటి దాడులే జరిగాయని ఆయన గుర్తు చేశారు. దీంతో ఒబమా విగ్రహం చెవులు ఆరుసార్లు పోయాయట. అలాగే ​బుష్​ మైనపు బొమ్మ ముక్కును కూడా కొందరు విరగ్గొట్టారని స్టీవర్ట్ తెలిపారు.


Updated Date - 2021-03-20T18:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising