ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లజాతీయుల పుర్రెలు సేకరించిన మ్యూజియం.. విషయం బయటపడటంతో..

ABN, First Publish Date - 2021-04-14T11:03:49+05:30

అగ్రరాజ్యం అమెరికాలో జాతి విద్వేష ఘటనలకు కొదవలేదు. ముఖ్యంగా నల్లజాతీయుల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడు తాజాగా బయటపడిన ఘటన కూడా ఈ కోవకు చెందిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్సిల్వేనియా: అగ్రరాజ్యం అమెరికాలో జాతి విద్వేష ఘటనలకు కొదవలేదు. ముఖ్యంగా నల్లజాతీయుల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడు తాజాగా బయటపడిన ఘటన కూడా ఈ కోవకు చెందిందే. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఒక మ్యూజియం.. నల్లజాతి అమెరికన్ల పుర్రెలు సేకరిస్తూ వచ్చింది. ఇలా ఆ మ్యూజియం సేకరించిన పుర్రెలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


దీంతో సదరు మ్యూజియం ప్రజలను క్షమాపణలు కోరింది. ఇప్పటి వరకూ సేకరించిన పుర్రెలను కూడా వారి వారి సామాజిక వర్గాలకు అందజేస్తామని తెలిపింది. ‘‘ఈ సేకరణకు దారి తీసిన కొలోనియల్ విధానాలను సంస్కరించి, ఇలా చేసినందుకు పశ్చాత్తాపంగా.. మ్యూజియంలో ఉన్న పుర్రెలన్నింటినీ ఎక్కడ కుదిరితే అక్కడ ఆ పుర్రెలకు సంబంధించిన కమ్యూనిటీలకు అందజేస్తాం’’ అని మ్యూజియం డైరెక్టర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-04-14T11:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising