ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేడీ గాగాకు చెందిన కుక్కపిల్లలను రక్షించిన పోలీసులు!

ABN, First Publish Date - 2021-02-28T03:04:36+05:30

ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగాకు చెందిన కుక్కపిల్లను రక్షించినట్టు పోలీసులు తెలిపారు. వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. లేడీ గాగాకు ఫ్రెంచ్ బుల్‌డాగ్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగాకు చెందిన కుక్కపిల్లను రక్షించినట్టు పోలీసులు తెలిపారు. వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. లేడీ గాగాకు ఫ్రెంచ్ బుల్‌డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఆమె మూడు ఫ్రెంచ్ బుల్‌డాగ్స్‌ను పెంచుకుంటున్నారు. వాటిని చూసుకోవడానికి ఇద్దరు సంరక్షకులను కూడా ఆమె నియమించారు. ఈ క్రమంలో వాటిని వాకింగ్ తీసుకెళ్లిన సమయంలో కొందరు దుండగులు సంరక్షక్షుడిపై బుధవారం రాత్రి కాల్పులు జరిపి కోజీ, గుస్తన్ అనే శునకాలను ఎత్తుకెళ్లారు. దీంతో స్పందించిన లేడీ గాగా.. వాటి సమాచారం ఇచ్చిన వారికి రూ.3.6కోట్లను బహుమతిగా ఇస్తానని కూడా ప్రకటించారు. మరోవైపు పోలీసులు కూడా వాటి జాడను కనిపెట్టడంపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో వాటి ఆచూకు పోలీసులకు తెలిసింది. కోజీ, గుస్తన్‌లను రక్షించి.. లేడీ గాగా‌కు సంబంధించిన ప్రతినిధులకు వాటిని చేరవేసినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా పోలీసులు ప్రకటించారు. 


Updated Date - 2021-02-28T03:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising