ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రద్దీగా ఉండే హైవేపై.. విమానం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌

ABN, First Publish Date - 2021-05-15T22:44:58+05:30

అమెరికాలోని చికాగోలో ఓ చిన్న విమానం గురువారం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ అయింది. రద్దీగా ఉండే టోల్​ హైవే పైనే ఈ విమానాన్ని దిగ‌డం గ‌మ‌నార్హం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చికాగో: అమెరికాలోని చికాగోలో ఓ చిన్న విమానం గురువారం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ అయింది. రద్దీగా ఉండే టోల్​ హైవే పైనే ఈ విమానాన్ని దిగ‌డం గ‌మ‌నార్హం. విమానం ఇంజిన్‌లో త‌లెత్తిన‌ సాంకేతిక సమస్య కారణంగానే ఇలా ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్​ కావాల్సి వచ్చిందని ఇల్లినాయిస్​ పోలీసులు తెలిపారు. గురువారం ఉద‌యం 11.10 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ స‌మ‌యంలో విమానంలో పైల‌ట్‌తో క‌లిపి న‌లుగురు ఉన్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. న‌లుగురికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. దాంతో వారిని చికిత్స కోసం హూటాహూటిన స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌న్నారు. ఇక ఎల్ల‌ప్పుడూ ర‌ద్దీగా ఉండే హైవేపై విమానం ల్యాండ్ కావ‌డంతో దాదాపు నాలుగు గంట‌ల పాటు ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డినట్లు ఇల్లినాయిస్​ పోలీసులు చెప్పారు.  




Updated Date - 2021-05-15T22:44:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising