ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులకు వింత అనుభవం.. బ్యాగులో బాంబ్ ఉందనుకున్నారు..కానీ!

ABN, First Publish Date - 2021-02-22T02:15:58+05:30

అమెరికాలోని ఒహియో రాష్ట్ర పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. ఆ రాష్ట్రానికి చెందిన అధికారులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఒహియో రాష్ట్రంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలోని ఒహియో రాష్ట్ర పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. ఆ రాష్ట్రానికి చెందిన అధికారులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఒహియో రాష్ట్రంలోని న్యూ మియామి గ్రామంలోని చర్చిలో అనుమానాస్పద బ్యాగు ఉందని సమాచారం అందడంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాంబు స్కాడ్ బృందం అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి ఓ బ్యాగ్‌ను గుర్తించారు. అందులో పేలుడు పదార్థాలు ఉండొచ్చనే అనుమానంతో.. అన్ని జాగ్రత్తలూ తీసుకుని పోలీసులు దాన్ని ఓపెన్ చేశారు. తీరా అందులో.. పిల్లిపిల్లలు, దాని తల్లితోపాటు ఓ లెటర్‌ను గుర్తించి.. అధికారులు కంగుతిన్నారు. కాగా.. ఆ లెటర్‌లో ‘తల్లి పేరు  స్ప్రింక్లేస్. మధ్యాహ్నం అది పిల్లలకు జన్మనిచ్చింది’ అని ఉండటంతో వారికి విషయం అర్థమైంది. ఈ క్రమంలో పోలీసులు.. తమకు ఎదురైన వింత అనుభవాన్ని పేర్కొంటూ ‘తల్లి, పిల్లలు బాగానే ఉన్నాయని’ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపట్ల స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలు కామెంట్ చేస్తున్నారు. 


Updated Date - 2021-02-22T02:15:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising