ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికన్ల వింత వాదన.. మాస్కులు స్వేచ్ఛను హరిస్తున్నాయట!

ABN, First Publish Date - 2021-03-08T14:41:31+05:30

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్‌తో తీవ్రంగా ప్రభావితం అయింది. కోట్లాది మంది మహమ్మారి బారినపడగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఇప్పుడిప్పుడే అమెరికా కొవిడ్ బారి నుంచి క్రమంగా బయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్‌తో తీవ్రంగా ప్రభావితం అయింది. కోట్లాది మంది మహమ్మారి బారినపడగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఇప్పుడిప్పుడే అమెరికా కొవిడ్ బారి నుంచి క్రమంగా బయటపడుతోంది. రోజువారీ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అమెరికన్లు.. మాస్కులు ధరించడం ద్వారా తాము స్వేచ్ఛను కోల్పోయామంటూ మొండిగా వాదిస్తున్నారు. అంతేకాకుండా మాస్కులను తగలబెడుతున్నారు. తమ పిల్లలనూ దానికి ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఇడాహో రాష్ట్ర రాజధానిలో వందలాది మంది మాస్క్, కొవిడ్ వ్యాక్సిన్ వ్యతిరేకవాదులు తాజాగా భారీ ర్యాలీ చేపట్టారు. మాస్క్‌ ధరించడానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాస్క్‌లు ధరించడ ద్వారా తాము స్వేచ్ఛను కోల్పోయినట్టు వ్యాక్యానించారు. అంతటితో ఆగకుండా మాస్కులను ఓ డబ్బాలో వేసి, తగలబెట్టారు. మాస్కులకు నిప్పంటించాలంటూ తమ పిల్లలను కూడా ప్రోత్సహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో ఇప్పటి వరకు 29 మిలియన్ల మంది కొవిడ్ బారినపడగా.. 5లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.  




Updated Date - 2021-03-08T14:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising