ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్ర‌రాజ్యంలో కాల్పుల క‌ల‌క‌లం.. ఒక‌రు మృతి, 13 మందికి గాయాలు

ABN, First Publish Date - 2021-06-18T18:14:36+05:30

అగ్ర‌రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. అరిజోనాలోని వెస్ట్‌ ఫోనిక్స్‌లో ఓ దుండగుడు కేవ‌లం 90 నిమిషాల వ్యవధిలోనే మూడు ప్రాంతాల్లో కాల్పులకు తెగ‌బ‌డ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరిజోనా: అగ్ర‌రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. అరిజోనాలోని వెస్ట్‌ ఫోనిక్స్‌లో ఓ దుండగుడు కేవ‌లం 90 నిమిషాల వ్యవధిలోనే మూడు ప్రాంతాల్లో కాల్పులకు తెగ‌బ‌డ్డాడు. దీంతో ఒక‌రు చనిపోగా, 13 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పియోరియా, సర్‌ప్రైజ్‌, గ్లెండెల్‌ పోలీసులు విభాగాలు ఎఫ్​బీఐ, అరిజోనా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీతో కలిసి దర్యాప్తు చేప‌ట్టాయి. ద‌ర్యాప్తులో భాగంగా ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక దేశ‌వ్యాప్తంగా త‌ర‌చూ కాల్పుల ఘ‌ట‌నలు చోటు చేసుకుంటున్న నేప‌థ్యంలో గ‌న్ క‌ల్చ‌ర్‌ను కట్టడి చేసేందుకు దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఏడాది​ ఏప్రిల్‌లో​ కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. సీరియల్​ నంబర్లు లేని గ‌న్స్‌తో పాటు నాటు తుపాకులపై ఆంక్షలు విధించారు. అయినా అగ్ర‌రాజ్యంలో కాల్పుల ఘ‌ట‌న‌లు ఆగ‌క‌పోవ‌డం గమనార్హం.

Updated Date - 2021-06-18T18:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising