ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెన్వర్‌పై మంచు తుఫాన్ పంజా.. 2వేల విమాన సర్వీసులు రద్దు !

ABN, First Publish Date - 2021-03-14T17:31:56+05:30

అమెరికాలోని డెన్వర్‌ నగరంపై మంచు తుఫాన్ పంజా విసిరింది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెన్వర్: అమెరికాలోని డెన్వర్‌ నగరంపై మంచు తుఫాన్ పంజా విసిరింది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో శని, ఆదివారాల్లో కలిపి డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన సుమారు 2,000 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. డెన్వర్, బౌల్డర్‌లో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు దాదాపు 46 నుంచి 61 సెంటీమీటర్ల మంచు కురిసే అవకాశం ఉన్నట్లు జాతీయ వాతావరణ శాఖ పేర్కొంది. కనుక ఈ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


మరోవైపు కొలరాడో రవాణా శాఖ కూడా హెచ్చరించింది. హైవేలకు సమీపంలో ఉన్నవారు సాధ్యమైనంత వరకు అనవసరమైన రోడ్డు ప్రయాణాలను వాయిదా వేసులకోవాలని సూచించింది. ప్రధానంగా డెన్వర్, మోనుమెంట్ హిల్, ఐ-70 టు లిమోన్, ఐ-76 టు ఫోర్ట్ మోర్గాన్ హైవేలపై మంచు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలిపింది. ఇక మంచు తుఫాన్ కారణంగా డెన్వర్ ఎయిర్‌పోర్టు నుంచి శనివారం 750 విమానాలు, ఆదివారం నాటి పూర్తి 1,300 విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు అధికార ప్రతినిధి ఎమ్లీ విలియమ్స్ వెల్లడించారు.    

Updated Date - 2021-03-14T17:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising