ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరెంట్స్‌ను కుమారుడికి రూ.22లక్షలు కట్టమన్న కోర్టు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

ABN, First Publish Date - 2021-08-29T19:08:50+05:30

అమెరికాలోని మిచిగాన్ న్యాయస్థానం ఇటీవల సంచలన తీర్పు వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిచిగాన్: అమెరికాలోని మిచిగాన్ న్యాయస్థానం ఇటీవల సంచలన తీర్పు వెల్లడించింది. కుమారుడు సేకరించిన పోర్నోగ్రఫీ కలెక్షన్‌ను పడేసినందుకు గాను పేరెంట్స్‌ను 30,441 డాలర్లు(రూ.22.37లక్షలు) చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి పాల్ మలోని తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మిచిగాన్‌కు చెందిన డేవిడ్ వర్కింగ్(43) అనే వ్యక్తి తన తల్లిదండ్రులపై 8 నెలల క్రితం కోర్టులో ఓ కేసు వేశాడు. తాను పోగుచేసుకున్న నీలి చిత్రాల సీడీలను తన పేరెంట్స్ పడవేశారని, వాటి ఖరీదు 29వేల డాలర్లు(సుమారు రూ.21లక్షలు) ఉంటుందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 


కాగా, భార్య నుంచి విడాకులు తీసుకున్న డేవిడ్ ప్రస్తుతం వీడిగా ఉంటున్నాడు. దీంతో తన తల్లిదండ్రులు నివాసం ఉండే మిచిగాన్‌కు వచ్చాడు. పది నెలల తర్వాత తిరిగి ఇండియానాలోని మూనిస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో డేవిడ్‌కు తాను సేకరించిన నీలి చిత్రాల సీడీలు, మ్యాగజైన్స్ ఉంచిన బాక్సులు కనిపించలేదు. దాంతో పేరెంట్స్‌ను అడిగాడు. వారు తామే వాటిని బయట పడేసినట్లు చెప్పారు. దీంతో గతేడాది డిసెంబర్‌లో ఈ విషయమై డేవిడ్ కోర్టుమెట్లు ఎక్కాడు. ఎనిమిది నెలల తర్వాత తాజాగా మిచిగాన్ కోర్టు తీర్పును వెల్లడించింది. పేరెంట్స్‌ను డేవిడ్‌కి 30వేల డాలర్లు(రూ.22.37లక్షలు) చెల్లించాలని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి పాల్ మలోని తీర్పునిచ్చారు.     

 

Updated Date - 2021-08-29T19:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising