ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడా మ‌హిళ ఉదార‌త‌.. పెళ్లైన రెండు రోజుల‌కే భ‌ర్త మాజీ భార్య‌కు కిడ్నీ దానం

ABN, First Publish Date - 2021-06-04T13:26:28+05:30

నెత్తురు పంచుకొని పుట్టిన వారికైనా కిడ్నీని దానం చేయాలంటే వెనుకాముందూ ఆలోచించే రోజులివి. అలాంటిది ఆ మహిళ.. తన భర్త మాజీ భార్యకు కిడ్నీని ఇచ్చింది. పైగా పెళ్లయిన రెండ్రోజులకే ఆమె ఇంతటి ఉదారాన్ని ప్రదర్శించడం గమనార్హం. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన డెబ్బీనీల్‌ అనే మహిళ చేసిన త్యాగమిది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్లోరిడా: నెత్తురు పంచుకొని పుట్టిన వారికైనా కిడ్నీని దానం చేయాలంటే వెనుకాముందూ ఆలోచించే రోజులివి. అలాంటిది ఆ మహిళ.. తన భర్త మాజీ భార్యకు కిడ్నీని ఇచ్చింది. పైగా పెళ్లయిన రెండ్రోజులకే ఆమె ఇంతటి ఉదారాన్ని ప్రదర్శించడం గమనార్హం. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన డెబ్బీనీల్‌ అనే మహిళ చేసిన త్యాగమిది. ఫ్లోరిడాకు చెందిన జిమ్‌, మైలాన్‌ మెర్తే (59) ఇరవై ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. వైవాహిక బంధాన్ని తెంచుకున్నా తమ పిల్లల కోసం స్నేహితులుగా కొనసాగుతున్నారు. కాగా పదేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న ప్రేయసి డెబ్బీనీల్‌ను జిమ్‌ గత నవంబరు 22న పెళ్లాడారు. ఆయన మాజీ భార్య మైలాన్‌ అప్పట్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె రెండు కిడ్నీలూ చెడిపోయాయి. తన కిడ్నీని ఇచ్చి, మైలాన్‌ ప్రాణాలను కాపాడేందుకు డెబ్బీనీల్‌ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. డెబ్బీ కిడ్నీని వైద్యులు మైలాన్‌కు అమర్చారు.  

Updated Date - 2021-06-04T13:26:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising