ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొసలిని దొంగిలించిన వ్యక్తి.. అతడు చెప్పిన మాటలు విని పోలీసులు షాక్!

ABN, First Publish Date - 2021-07-17T22:11:01+05:30

ఓ వ్యక్తి మూగ జీవిని హింసించడాన్ని పోలీసులు గమనించి.. అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా సదరు వ్యక్తి చెప్పిన మాటలు విని అధికారులు విస్తుపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో మొ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఓ వ్యక్తి మూగ జీవిని హింసించడాన్ని పోలీసులు గమనించి.. అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా సదరు వ్యక్తి చెప్పిన మాటలు విని అధికారులు విస్తుపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో మొసళ్ల సంచారం అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కాగా.. ఆ రాష్ట్రానికి చెందిన 32ఏళ్ల ఓ వ్యక్తి గోల్ఫ్ కోర్సు నుంచి కొన్ని రోజుల క్రితం చిన్నపాటి మొసలిని దొంగిలించి తన ఇంటికి తీసుకెళ్లాడు. తాజాగా అతడు దాని తోకను పట్టుకుని బిల్డింగ్ రూఫ్‌పై విసరడాన్ని అటువైపుగా వెళ్తున్న పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మూగ జీవి అని కూడా అతడు దాని తోకపై కొట్టడం, విన్యాసాలు చేయడాన్ని గమనించారు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులు.. ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు. ‘నేను దీనికి పాఠాలు నేర్పిస్తున్నాను’ అని అతడు చెప్పడంతో పోలీసు అధికారులు ఒక్కక్షణంపాటు షాక్‌కు గురయ్యారు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలు‌కు తరలించారు. అంతేకాకుండా ఆ మొసలి పిల్లను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు.


Updated Date - 2021-07-17T22:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising