ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడాకు చేరిన కొత్త స్ట్రెయిన్..!

ABN, First Publish Date - 2021-01-01T23:21:21+05:30

బ్రిటన్‌లో బయటపడిన కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలోనూ ఉనికిని చాటుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్లోరిడా: బ్రిటన్‌లో బయటపడిన కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలోనూ ఉనికిని చాటుతోంది. మంగళవారం కొలరాడోలో తొలి కేసు నమోదు కాగా, శుక్రవారం ప్లోరిడాలో మరో కేసు నమోదైంది. దీంతో స్ట్రెయిన్ కేసులు నమోదైన మూడో రాష్ట్రంగా ఫ్లోరిడా నిలిచింది. ఫ్లోరిడాలోని మార్టిన్ కౌంటీలో 20 ఏళ్ల ఓ యువకుడిలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ఫ్లోరిడా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, యువకుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, అతనికి స్ట్రెయిన్ ఎలా సోకిందో తెలుసుకునేందుకు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ)తో కలిసి పనిచేస్తున్నట్లు ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ ట్వీట్ చేసింది. అలాగే యువకుడి ప్రైమరీ కాంటాక్ట్‌ను గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 


ఇక కొలరాడోలో నమోదైన తొలి కేసులో కూడా ఇలాగే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని యువకుడు స్ట్రెయిన్ బారినపడ్డట్టు నిర్దారణ అయింది. ఆ తర్వాత రెండో కేసు కాలిఫోర్నియాలోని శాన్ డియాగో కౌంటీలో నమోదైంది. ఇప్పుడు ఫ్లోరిడాలో మరో కేసు నమోదు కావడంతో అగ్రరాజ్యంలో స్ట్రెయిన్ కేసుల సంఖ్య 3కి చేరింది. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుండగా.. ఇప్పుడు స్ట్రెయిన్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండడం అమెరికన్లను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, స్ట్రెయిన్ వ్యాప్తిని అరికట్టడానికి బ్రిటన్ నుంచి వచ్చేవారికి కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది సీడీసీ. ఇదిలా ఉంటే... వరల్డ్ఓమీటర్.ఇన్‌ఫో డేటా ప్రకారం ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా రెండు కోట్లకు పైగా మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 3.54 లక్షల మందిని మహమ్మారి బలిగొంది.

Updated Date - 2021-01-01T23:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising