ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శస్త్రచికిత్స చేస్తూనే కోర్టు విచారణకు హాజరైన డాక్టర్!

ABN, First Publish Date - 2021-03-01T02:36:59+05:30

ఓ డాక్టర్ ఆపరేషన్ థియేటర్‌లో పేషెంట్‌కు శస్త్రచికిత్స చేస్తూనే కోర్టు విచారణకు హాజరై.. జడ్జిని కంగుతినింపిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: ఓ డాక్టర్ ఆపరేషన్ థియేటర్‌లో పేషెంట్‌కు శస్త్రచికిత్స చేస్తూనే కోర్టు విచారణకు హాజరై.. జడ్జిని కంగుతినింపిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ స్కాట్ గ్రీన్.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించారు. దీంతో అక్కడి అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసు తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా డాక్టర్ స్కాట్ గ్రీన్.. ఆఫరేషన్ థియేటర్‌లో ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేస్తూనే జూమ్‌ కాల్ ద్వారా విచారణకు హాజరయ్యారు. డాక్టర్‌ను సర్జికల్ డ్రెస్‌లో చూసి జడ్జి ఆశ్చర్యపోయారు. అనంతరం అతను ఓ పేషెంట్‌కు శస్త్రచికిత్స చేస్తున్నట్టు తెలుసుకుని మరింత షాకయ్యారు. ఈ క్రమంలో ‘విచారణను మరోరోజుకు వాయిదా వేయమంటారా’ అని డాక్టర్‌ స్కాట్ గ్రీన్‌ను అడగ్గా.. స్పందించిన ఆయన.. దానికి ఒప్పుకోలేదు.


అంతేకాకుండా మరో డాక్టర్ తన పక్కనే ఉన్నారని.. పేషెంట్‌కు అతను శస్త్రచికిత్స చేస్తాడనీ.. విచారణను కొనసాగించాలని కోరడంతో జడ్జి కంగుతిన్నారు. అనంతరం పేషెంట్‌ ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తి విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో స్పందించిన డాక్టర్ స్కాట్ గ్రీన్.. జడ్జిని క్షమాపణలు కోరారు. కాగా.. ఈ విషయాన్ని స్థానిక వార్తా పత్రికలు ప్రచురించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కాలిఫోర్నియా మెడికల్ బోర్డ్ స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరపనున్నట్టు వెల్లడించింది. 


Updated Date - 2021-03-01T02:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising