ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్ర‌యాణికుడి వికృత చేష్ట‌లు.. విమానం దారి మ‌ళ్లింపు!

ABN, First Publish Date - 2021-06-05T19:47:14+05:30

కాలిఫోర్నియా నుంచి టెన్నెసీ వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్ విమానంలో ఓ ప్ర‌యాణికుడు హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఏకంగా కాక్‌పిట్‌లోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దాంతో విమానాన్ని న్యూ మెక్సికో మ‌ళ్లించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్ ఏంజిల్స్‌: కాలిఫోర్నియా నుంచి టెన్నెసీ వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్ విమానంలో ఓ ప్ర‌యాణికుడు హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఏకంగా కాక్‌పిట్‌లోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దాంతో విమానాన్ని న్యూ మెక్సికోకు మ‌ళ్లించారు. వివ‌రాల్లోకి వెళ్తే.. డెల్టా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్ 737-900 విమానం 162 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బందితో లాస్ ఏంజిల్స్ నుంచి నాష్‌విల్లే బ‌య‌ల్దేరింది. ఈ క్ర‌మంలో విమానంలో ఓ వ్య‌క్తి త‌న వికృత చేష్ట‌ల‌తో తోటి ప్ర‌యాణికుల‌ను ఇబ్బందుల‌కు గురిచేశాడు. విమాన సిబ్బంది స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేసిన వినిపించుకోలేదు. పైగా త‌న‌కు క‌డుపులో నొప్పిగా ఉంద‌ని, వెంట‌నే ఫ్లైట్‌ను ఆపాలంటూ ప‌దేప‌దే అరిచాడు. అంత‌టితో ఆగ‌కుండా కాక్‌పిట్‌లోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దాంతో చేసేదేమిలేక విమానాన్ని న్యూ మెక్సికోకు మ‌ళ్లించారు. న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్ విమానాశ్ర‌యంలో విమానాన్ని ల్యాండ్ చేసి, స‌దరు వ్య‌క్తిని ఎఫ్‌బీఐ అధికారుల‌కు అప్ప‌గించారు. ఆ త‌ర్వాత విమానం య‌ధావిధిగా మ‌ళ్లీ నాష్‌విల్లేకు బ‌య‌ల్దేరింది. 

Updated Date - 2021-06-05T19:47:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising