ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒరెగాన్​లో కార్చిచ్చు.. 10వేల ఎకరాల అటవీ భూమి దగ్ధం!

ABN, First Publish Date - 2021-07-02T19:30:49+05:30

అమెరికాలోని ఒరెగాన్​లో కార్చిచ్చు కల్లోలం సృష్టిస్తోంది. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలల ధాటికి 10వేల ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. దీంతో రంగంలోకి దిగిన 40 మంది అగ్నిమాపక సిబ్బంది, 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒరెగాన్: అమెరికాలోని ఒరెగాన్​లో కార్చిచ్చు కల్లోలం సృష్టిస్తోంది. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలల ధాటికి 10వేల ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. దీంతో రంగంలోకి దిగిన 40 మంది అగ్నిమాపక సిబ్బంది, 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కార్చిచ్చు నేపథ్యంలో ఒరెగాన్​ సరిహద్దు ప్రాంతాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు మూతపడ్డాయి. ఈ నెల 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీగా బాణసంచాకు డిమాండ్ ఉంటుంది. కానీ, కార్చిచ్చు నేపథ్యంలో ఇవి మూతపడ్డాయి. పోర్ట్‌ల్యాండ్ మేయర్ టెడ్ వీలర్ నగరంలో బాణసంచా అమ్మలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అటు కార్చిచ్చు నేపథ్యంలో ఒరెగాన్​ రాష్ట్ర గవర్నర్​ కేట్ బ్రౌన్ అత్యవసర స్థితిని ప్రకటించారు. ఇదిలాఉంటే.. ఉత్తర కాలిఫోర్నియాలోనూ దావానలం విజృంభించడంతో ఇప్పటికే 27 చదరపు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఓ అగ్నిపర్వతం బద్ధలు కావడంతో ఈ మంటలు వ్యాపించినట్లు సమాచారం. 

Updated Date - 2021-07-02T19:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising