ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారం జరిగినా అబార్షన్ చేయించుకోవడం నేరమే.. అమెరికాలో కొత్త చట్టం

ABN, First Publish Date - 2021-03-10T18:34:51+05:30

అమెరికాలోని అర్కన్సాస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరే ఇతర రాష్ట్రం తీసుకురాని విధంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్కన్సాస్: అమెరికాలోని అర్కన్సాస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరే ఇతర రాష్ట్రం తీసుకురాని విధంగా కొత్త అబార్షన్ చట్టాన్ని ఇక్కడి ప్రభుత్వం తీసుకొస్తోంది. అత్యాచారం, వ్యభిచారం కారణంగా గర్భం దాల్చినా అబార్షన్ చేయించడం నేరమనే విధంగా గవర్నర్ అస్సా హట్చిన్‌సన్ మంగళవారం కొత్త బిల్లుపై సంతకం చేశారు. కోర్టు అడ్డుకోకుంటే ఆగస్టు నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం కేవలం మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప అత్యాచారం, వ్యభిచారం కారణంగా కూడా అబార్షన్ చేయించుకోవడం నేరంగా పరిగణిస్తారు. 


అమెరికాలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే అబార్షన్ బిల్లులను పాస్ చేశాయి. అయితే అత్యాచారం, వ్యభిచారం కేసులలో కూడా అబార్షన్ చేయడానికి అనుమతి ఉండదని ఏ రాష్ట్రం కూడా చెప్పలేదు. ఇటీవల సౌత్ కెరోలినా ఇటువంటి చట్టమే చేయగా ఫెడరల్ కోర్టు ఆ చట్టాన్ని కొట్టేసింది. దీంతో అర్కన్సాస్ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని కూడా కోర్టు కొట్టివేయడం ఖాయమని చెబుతున్నారు. అత్యాచారం, వ్యభిచారం అంశాల్లో మాత్రం మినహాయింపు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు అర్కన్సాస్ గవర్నర్ అస్సా హట్చిన్‌సన్ పేర్కొన్నారు. వాటికి మినహాయింపు ఇస్తే కోర్టు ఈ చట్టాన్ని అడ్డుకోకపోవచ్చని ఆయన చెప్పారు.

Updated Date - 2021-03-10T18:34:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising