ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుకోని అతిథి రాకతో షాక్‌లో పోస్టాఫీస్ సిబ్బంది.. నోట మాట రాలేదు!

ABN, First Publish Date - 2021-06-11T23:40:41+05:30

అమెరికాలోని పోస్టాఫీసును తాజాగా అనుకోని అతిథిగా సందర్శించింది. పోస్టాఫీస్‌‌ను అతిథి ఆకస్మికంగా సందర్శించడంతో అందులో పని చేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారికి నోట మాట కూడా రాలే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని పోస్టాఫీసును తాజాగా అనుకోని అతిథిగా సందర్శించింది. పోస్టాఫీస్‌‌ను అతిథి ఆకస్మికంగా సందర్శించడంతో అందులో పని చేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారికి నోట మాట కూడా రాలేదు. ఆ అతిథి ఎందుకొచ్చిందో తెలియక టెన్షన్‌తో తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలో.. ఆ అతిథి గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. పోస్టాఫీస్ వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆ అతిథిని కూడా తమతోపాటే తీసుకెళ్లారు. పోస్టాఫీస్‌లో పని చేసే సిబ్బందికి నోట మాట రాకుండా చేసిన ఆ అతిథి ఎవరు? అని ఆలోచిస్తున్నారా. అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి. 



ఫ్లోరిడాలోని స్ప్రింగ్ హిల్ ప్రాంతంలో ఉన్న పోస్టాఫీస్‌ లాబీలోకి ఈ నెల 9న.. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ 7 అడుగుల మొసలి ప్రవేశించింది. ఉత్తరాన్ని పోస్ట్ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి దాన్ని చూసి అవక్కయ్యాడు. అంతేకాకుండా పోస్ట్‌ఆఫీస్ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో విషయం తెలుకున్న సిబ్బంది లాబీ దగ్గరకు పరుగులు తీశారు. ఏడు అడుగుల మొసలిని చూసి షాక్ అయ్యారు. దీంతో వారికి నోటి వెంట మాట రాలేదు. అనంతరం షాక్ నుంచి తేరుకున్న సిబ్బంది.. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో హెర్నాండో కౌంటీకి చెందిన షరీఫ్ కార్యాలయం సిబ్బంది.. హుటాహుటిన అక్కడకు చేరుకుని దాన్ని అక్కడ నుంచి తొలగించారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా షరీఫ్ కార్యాలయం సిబ్బంది నెటిజన్లతో పంచుకుంది. దీంతో ఆ వార్త కాస్తా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలు కామెంట్ చేస్తున్నారు. 


Updated Date - 2021-06-11T23:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising