ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE లో ఓ భారతీయుడి వీడియో.. నేరుగా యువరాజే పోలీసులను పిలిచి మరీ..

ABN, First Publish Date - 2021-08-31T18:16:26+05:30

కరోనా కారణంగా చాలా రోజులు మూతపడ్డ స్కూళ్లను తిరిగి తెరిచేందుకు యూఏఈ కసరత్తు చేస్తోంది. వేసవి సెలువులు ముగిసిన వెంటనే తిరిగి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని చూస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజ్మాన్: కరోనా కారణంగా చాలా రోజులు మూతపడ్డ స్కూళ్లను తిరిగి తెరిచేందుకు యూఏఈ కసరత్తు చేస్తోంది. వేసవి సెలువులు ముగిసిన వెంటనే తిరిగి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని చూస్తోంది. దీనిలో భాగంగా తరగతులకు తిరిగి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాలనే షరతు పెట్టింది. ముఖ్యంగా అబుధాబి, షార్జా, అజ్మాన్‌లోని పాఠశాలల్లో విద్యార్థులు పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. దీంతో అజ్మాన్‌లో ఇలాగే పీసీఆర్ టెస్టు కోసం ఓ భారతీయ మహిళ శనివారం తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చింది. కానీ, వేసవి కాలం కావడంతో ఆ సమయంలో ఎండలు మండిపోతున్నాయి. అదే సమయంలో పరీక్ష కేంద్రం వద్ద టెస్టింగ్ కోసం వచ్చే వారికి సరైన సదుపాయం కలిపించలేదు నిర్వాహకులు. దాంతో మండుటెండలోనే ఇద్దరు పిల్లలతో ఆ తల్లి అలాగే నిలబడిపోయింది. 


ఇలా ఆ తల్లిబిడ్డలు ఎండలో బిక్కుబిక్కుమంటు నిలబడి ఉండడం గమనించిన అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు పెద్ద మనసు చాటారు. వెంటనే ఆ ముగ్గురిని వారి వంతు వచ్చే వరకు తమ పెట్రోలింగ్ వాహనంలో కూర్చొబెట్టారు. అనంతరం వారి వంతు రాగానే పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ మహిళ భర్త సోషల్ మీడియాలో పెట్టారు. తన భార్య, పిల్లలను చేరదీసినందుకు ధన్యవాదాలు తెలియజేయడం ఈ వీడియోలో ఉంది. దాంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయింది. అజ్మాన్ క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మర్ బిన్ హుమాయిద్ అల్ నుయిమి దృష్టికి కూడా వెళ్లింది. ఆయన ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశారు. 


ఈ సందర్భంగా మానవతా దృక్పథంతో తల్లిబిడ్డలకు ఆశ్రయం కల్పించినందుకు ఆ ఇద్దరు పోలీసులను యువరాజు మెచ్చుకున్నారు. సోమవారం ఆ ఇద్దరు పోలీసులను అధికార కార్యాలయానికి ఆహ్వానించి సన్మానించారు. హషెమ్ ముహమ్మద్ అబ్దుల్లా, ఫాత్ అల్ రెహమాన్ అహ్మద్ అబ్షర్‌లను యువరాజు ఇలా ప్రత్యేకంగా సత్కరించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇద్దరు పోలీసు అధికారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.     

Updated Date - 2021-08-31T18:16:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising