ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానంలో రచ్చరచ్చ చేసిన భారతీయుడు.. దీంతో ఫైలెట్ వెంటనే!

ABN, First Publish Date - 2021-03-07T02:17:14+05:30

ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో భారతీయుడు బీభత్సం సృష్టించాడు. దీంతో ఫైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఫ్రాన్స్ విమానం శుక్రవారం సాయంత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో భారతీయుడు బీభత్సం సృష్టించాడు. దీంతో ఫైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఫ్రాన్స్ విమానం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పారిస్ నుంచి న్యూఢిల్లీకి బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే అందులో ప్రయాణిస్తున్న భారతీయుడు అలజడి సృష్టించాడు. ఇతర ప్రయాణికులతో గొడవకు దిగాడు. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన విమానం సిబ్బందిపై దాడి చేయడంతో పాటు కాక్‌పిట్ తులపును బలంగా బాదాడు. ఈ క్రమంలో విమానాన్ని ఫైలెట్ బల్గేరియాలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు.. విచారణ ప్రారంభించారు. తప్పు చేసినట్టు దర్యాప్తులో తేలితే.. అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన పేరును కానీ ఇతర వివరాలను కానీ అధికారులు వెల్లడించలేదు. 


Updated Date - 2021-03-07T02:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising