ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New York గవర్నర్‌పై క్రిమినల్ కేసు నమోదు

ABN, First Publish Date - 2021-08-08T00:10:12+05:30

న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో‌కు మహిళ షాకిచ్చింది. క్రిమినల్ కేసు పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆండ్రూ క్యూమో దగ్గర పని చేసిన ఓ మహిళా ఉద్యోగి.. ఆయన తనను లైంగికంగా వేధించినట్టు ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో‌కు మహిళ షాకిచ్చింది. క్రిమినల్ కేసు పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆండ్రూ క్యూమో దగ్గర పని చేసిన ఓ మహిళా ఉద్యోగి.. ఆయన తనను లైంగికంగా వేధించినట్టు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆండ్రూ క్యూమో.. అధికార నివాసంలో తనపై చేతులు వేసి, అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజుల క్రితం న్యూయార్క్‌లో సంచలనం అయ్యాయి. అనంతరం మరో 10 మంది మహిళలు కూడా ముందుకొచ్చి ఆండ్రూ క్యూమో చేసిన నీచమైన పనులను బయటపెట్టారు.


దీంతో ఈ ఆరోపణలపై విచారణ జరిగింది. ఆండ్రూ క్యూమో 11 మంది మహిళలను లైంగికంగా వేధించారని న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ తాజాగా ఇచ్చిన నివేదికలో తేల్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా స్పందించారు. గవర్నర్ పదవికి ఆండ్రూ క్యూమో రాజీనామా చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే.. బాధిత మహిళ ఆండ్రూ క్యూమోపై ఆల్బనీ కౌంటీ షరీఫ్ కార్యాలయంలో క్రిమినల్ కేసు పెట్టింది. ఈ విషయాన్ని షరీఫ్ కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. అయితే ఆండ్రూ క్యూమో‌పై కేసు పెట్టిన మహిళ పేరు మాత్రం అధికారులు వెల్లడించలేదు.


Updated Date - 2021-08-08T00:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising