ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదం.. 5 రోజుల పాటు కారులోనే చిక్కుకుపోయిన వృద్ధురాలు.. ప్రాణాలను ఎలా నిలబెట్టుకుందో తెలిస్తే..

ABN, First Publish Date - 2021-12-31T03:04:30+05:30

గడ్డుకట్టుకునే చలి.. రోడ్డంతా మంచుతో నిండిపోయింది. అటువంటి రోడ్డుపై అమెరికాకు చెందిన లినెల్ మెక్‌ఫార్మల్యాండ్ వెళుతుండగా.. అనుకోని ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: గడ్డకట్టే చలి.. రోడ్డంతా మంచుతో నిండిపోయింది. అటువంటి రోడ్డుపై అమెరికాకు చెందిన లినెల్ మెక్‌ఫార్మల్యాండ్(68) వెళుతుండగా.. అనుకోని ప్రమాదం జరిగింది. మంచుపై జారడంతో అకస్మాత్తుగా అదుపు తప్పిన కారు.. రోడ్డు పక్కనే ఉన్న ఓ గొయ్యిలో తల్లకిందులుగా పడిపోయింది. గత నెల 18న ఆమె వాషింగ్టన్‌లోని తన ఇంటికి వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాద తీవ్రతకు లినెల్ చేయి, మోకాలు విరిగిపోయాయి. సీట్ బెల్ట్ తొలగించేందుకు ఆమె ప్రయత్నిస్తుండగా.. శరీరం బయటకు పొడుచుకొచ్చిన ఎముక ఆమెకు కనిపించింది. తాను బతికుంటానన్న ఆశ దూరమవుతున్న సమయం అది. 


అలా ఏకంగా ఐదు రోజుల పాటు ఆమె కారులోనే గడిపింది. ఆ తరువాత.. విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆ ఐదు రోజుల పాటు ఆమె కారులో పడిన వాన నీటి చుక్కలను తాగుతూ ప్రాణాలను నిలబెట్టుకుంది. ఇటీవల ఆమె కుటుంబసభ్యుల మధ్యే క్రిస్మస్ పండుగ జరుపుకుంది. ‘‘నేను ప్రాణాలతో బయటపడ్డానంటే దానికి కారణంగా నా పట్టుదల కాదు.. ఏదో అద్భుతం జరగబట్టే నేను బతికి బట్టకట్టా.. ఆ ఐదురోజులు నా తండ్రి చేతులు నా చుట్టూ పెనవేసుకున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఆ విషయం తలుచుకుంటే.. నా వెంట అప్పుడున్నది భగవంతుడే అనిపిస్తోంది’’ అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

Updated Date - 2021-12-31T03:04:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising