ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబుధాబి కీలక ప్రకటన.. భారతీయులకు మాత్రం నిరాశే!

ABN, First Publish Date - 2021-06-14T16:33:10+05:30

అబుధాబి కీలక ప్రకటన చేసింది. మే 23న వెలువరించిన ‘గ్రీన్ లిస్ట్’ దేశాల జాబితాను సవరించి.. అందులో మరికొన్ని దేశాలను చేర్చినట్టు వెల్లడించింది. ఈ ‘గ్రీన్ లిస్ట్’ దేశాల జాబితాల నుంచి వచ్చే ప్రయా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అబుధాబి కీలక ప్రకటన చేసింది. మే 23న వెలువరించిన ‘గ్రీన్ లిస్ట్’ దేశాల జాబితాను సవరించి.. అందులో మరికొన్ని దేశాలను చేర్చినట్టు వెల్లడించింది. ఈ ‘గ్రీన్ లిస్ట్’ దేశాల జాబితాల నుంచి వచ్చే ప్రయాణికులు క్వారెంటైన్ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే అబుధాబికి చేరుకున్న తర్వాత విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. కరోనా టీకా పూర్తి స్థాయిలో తీసుకున్న ప్రయాణికులు.. అబుధాబికి వెళ్లి ఆరు రోజులు గడిపిన తర్వాత మరోసారి కొవిడ్ టెస్ట్ చేయించుకోల్సి ఉంటుందని పేర్కొంది. కేవలం తొలి డోసు మాత్రమే తీసుకున్న వారు.. 12 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. కాగా.. ‘గ్రీన్ లిస్ట్’ దేశాల  జాబితాలో భారత్, బ్రిటన్ దేశాలను అబుధాబి చేర్చలేదు. దీంతో భారత ప్రయాణికులపై ఇప్పటికే అమలవుతున్న ఆంక్షలు మరికొన్ని రోజులు యథావిధిగా కొనసాగనున్నాయి. ఇదిలా ఉంటే.. ‘గ్రీన్ లిస్ట్’ దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, భూటాన్, యూఎస్, జర్మనీ, కెనడా, గ్రీన్‌లాండ్, న్యూజిలాండ్, సౌదీ, సింగపూర్, స్పెయిన్, జపాన్, హాంగ్ కాంగ్ తదితర దేశాలు ఉన్నాయి. 


Updated Date - 2021-06-14T16:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising