ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడిచిన 3 నెలల్లో.. కువైట్‌ వదిలివెళ్లిన 83వేల మంది ప్రవాసులు

ABN, First Publish Date - 2021-01-19T13:59:04+05:30

కువైటేజషన్‌లో భాగంగా కువైట్ సర్కార్ భారీగా ప్రవాస కార్మికులను తొలగిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: కువైటేజషన్‌లో భాగంగా కువైట్ సర్కార్ భారీగా ప్రవాస కార్మికులను తొలగిస్తోంది. దీనిలో భాగంగా గడిచిన 3 నెలల్లో ఏకంగా 83 వేలకు పైగా మంది ప్రవాస కార్మికులు కువైట్ వదిలివెళ్లినట్లు సమాచారం. గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 83,574 మంది ప్రవాసులు శాశ్వతంగా కువైట్ నుంచి వెళ్లిపోయినట్లు అక్కడి ప్రముఖ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. వీరిలో పబ్లిక్ సెక్టార్‌లో పనిచేస్తున్న 2,144 ప్రవాస కార్మికుల కాంట్రాక్టులను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ఇటీవల కువైట్ సర్కార్ 60 ఏళ్లకు పైబడిన, యూనివర్శిటీ సర్టిఫికేట్ లేని ప్రవాస కార్మికులను సైతం వీసా రెన్యూవల్ నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో కూడా వేలాది మంది ప్రవాస కార్మికులు స్వదేశానికి రావాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక గతేడాది ఏప్రిల్, జూన్ నెలల్లో అమలు చేసిన అమ్నెస్టీ కార్యక్రమం ద్వారా మరో 26వేల మంది కువైట్ వదిలి వెళ్లారు. దీంతో ప్రస్తుతం కువైట్‌లో ప్రవాస కార్మికుల సంఖ్య 1.5 మిలియన్లకు పడిపోయినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి.    

Updated Date - 2021-01-19T13:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising