ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమన్‌ను శాశ్వతంగా విడిచి వెళ్లేందుకు.. రిజిస్టర్ చేసుకున్న 65వేల మంది ప్రవాసులు!

ABN, First Publish Date - 2021-03-24T14:45:30+05:30

గతేడాది అక్టోబర్ 15 నుంచి ఇప్పటి వరకు సుమారు 65,173 మంది ప్రవాసులు ఒమన్‌ను శాశ్వతంగా విడిచి వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్నట్లు సుల్తానేట్ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: గతేడాది అక్టోబర్ 15 నుంచి ఇప్పటి వరకు సుమారు 65,173 మంది ప్రవాసులు ఒమన్‌ను శాశ్వతంగా విడిచి వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్నట్లు సుల్తానేట్ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే  46,355 మంది ప్రవాస కార్మికులు దేశం నుంచి వెళ్లిపోయినట్లు కార్మికశాఖ పేర్కొంది. ఈ నెల 31తో ఒమన్ తీసుకొచ్చిన క్షమాబిక్ష పథకం గడువు ముగియనుంది. గతేడాది అక్టోబర్ 15 నుంచి ఈ పథకాన్ని ఒమన్ సర్కార్ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రవాసులకు ఎవరికైతే ఓవర్‌స్టే, ఇతర కారణాల వల్ల పడిన జరిమానాలు చెల్లించకుండా స్వదేశానికి వెళ్లే వెసులుబాటు కల్పించింది ఒమన్. మరోవైపు మహమ్మారి కరోనా కారణంగా కూడా చాలా మంది ప్రవాసులు ఉపాధి కోల్పోయి స్వదేశానికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. వీరిలో చాలామంది జరిమానాలు చెల్లించాల్సిన వారు ఉంటారు. అలాంటి వారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారులు పేర్కొన్నారు. కనుక మార్చి 31లోపు తమ పేరు నమోదు చేసుకుని దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని వారు సూచించారు. 

Updated Date - 2021-03-24T14:45:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising