ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vande Bharat Mission: స్వదేశానికి చేరిన 60 లక్షల మంది భారతీయులు

ABN, First Publish Date - 2021-07-23T18:22:17+05:30

కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రం వందే భారత్ మిషన్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రం వందే భారత్ మిషన్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు సుమారు 60 లక్షల మందిని స్వదేశానికి తరలించినట్లు తాజాగా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. దీనిలో భాగంగా 2021, ఏప్రిల్ 30 నాటికి వివిధ దేశాల నుంచి 60,92,264 మందిని భారత్‌కు తీసుకువచ్చామని పేర్కొంది. అలాగే విదేశాల్లో దాదాపు 3,570 మంది భారతీయులు కరోనాతో చనిపోయినట్లు విదేశాంగ శాఖ తెలియజేసింది. అంతేగాక భారతదేశంలో పలువురు విదేశీ దౌత్యవేత్తలు కోవిడ్-19 బారిన పడ్డారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఇలా కరోనా సోకిన దౌత్యవేత్తలు, సిబ్బందికి వైద్య సహాయం అందించామని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేర్చడం, టెలిమెడిసిన్ సంప్రదింపులు, మందులు, టీకాలు వేయడం వంటివి ఈ సహాయంలో ఉన్నాయని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-07-23T18:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising