ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 శాతం జర్మనీ జనాభాకు అందిన రెండు డోసుల వ్యాక్సిన్

ABN, First Publish Date - 2021-07-29T10:45:50+05:30

యూరప్ దేశం జర్మనీలోని ప్రజల్లో 50శాతంపైగా పౌరులకు పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగింది. ఈ విషయాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెర్లిన్: యూరప్ దేశం జర్మనీలోని ప్రజల్లో 50శాతంపైగా పౌరులకు పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగింది. ఈ విషయాన్ని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ వెల్లడించారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పలువురు నిపుణులు బల్లగుద్ది చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ దేశంలో సగానికిపైగా ప్రజలకు వ్యాక్సిన్ రెండు డోసులూ అందిందని, వాళ్లు పూర్తి వ్యాక్సినేషన్ పొందారని స్పాన్ తెలిపారు. అలాగే జర్మనీ జనాభా మొత్తం 83 మిలియన్లుకాగా, వీరిలో 61.1శాతం మంది కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని ఆయన చెప్పారు. ‘‘ఎంత ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకుంటే అంత మంచిది. అప్పుడే వచ్చే చలికాలంలో మనం భద్రంగా ఉంటాం’’ అని స్పాన్ పేర్కొన్నారు.

Updated Date - 2021-07-29T10:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising