ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid 19: 70 దేశాల్లో.. 3,570 మంది భారతీయులు మృతి

ABN, First Publish Date - 2021-07-30T02:19:31+05:30

కరోనా కాటుకు 70దేశాల్లో సుమారు 3,570 మంది భారతీయులు బలైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఓ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వీ.మురళీధర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కాటుకు 70దేశాల్లో సుమారు 3,570 మంది భారతీయులు బలైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వీ.మురళీధరన్ స్పందించారు. మహమ్మారి కారణంగా దాదాపు 3,570 మంది భారతీయులు విదేశాల్లో చనిపోయారని పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇందులో 1,154 మరణాలు ఒక్క సౌదీ అరేబియాలోనే నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. యూఏఈలో 894 మంది, కువైత్‌లో 546 మంది, ఒమన్‌లో 384 మంది, బహ్రెయిన్‌లో 196 మంది, ఖతర్‌లో 106 మంది భారతీయులు కొవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 12.6 మిలియన్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో నివసిస్తున్నట్టు చెప్పారు. ఇందులో 8.9 మిలియన్ల మంది కేవలం ఆరు దేశాల్లోనే ఉన్నారని తెలిపారు. యూఏఈలో అత్యధికంగా 3.4 మిలియన్ల మంది, సౌదీ అరేబియాలో 2.6 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నట్టు వెల్లడించారు. కువైత్, ఒమన్, ఖతర్, బహ్రెయిన్‌ దేశాల్లో 2.9 మిలియన్ల మంది ప్రవాసులు ఉన్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-30T02:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising