ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడాలో ముగ్గురు భారత సంతతి యువకులు అరెస్ట్

ABN, First Publish Date - 2021-05-07T22:43:28+05:30

రెవెన్యూ అధికారులమంటూ బెరిదించి 80ఏళ్ల వృద్ధ మహిళ వద్ద డబ్బులు కాజేసిన ముగ్గురు భారత సంతతికి చెందిన యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కెనడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టొరెంటో: రెవెన్యూ అధికారులమంటూ బెరిదించి 80ఏళ్ల వృద్ధ మహిళ వద్ద డబ్బులు కాజేసిన ముగ్గురు భారత సంతతికి చెందిన యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కెనడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తరణ్‌వీర్ సింగ్ (19), రణ్వీర్ సింగ్ (19), చమన్జ్యోత్ సింగ్ (21) అనే ముగ్గురు యువకులు మే 3న 80ఏళ్ల వృద్ధ మహిళకు ఫోన్ చేశారు. తమను తాము రెవెన్యూ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. అనంతరం బ్యాంక్‌కు వెళ్లి 10వేల డాలర్ల డబ్బును డ్రా చేసి, ఆ మొత్తాన్ని బ్రామ్టన్‌లోని తాము పంపిన చిరునామాకు కొరియర్ ద్వారా పంపాలని సూచించారు. అంతేకాకుండా తాము చెప్పినట్టు చేయకపోతే అరెస్ట్ అవుతావంటూ సదరు మహిళను బెదిరించారు. దీంతో భయాందోళనలకు గురైన 80ఏళ్ల వృద్ధ మహిళ.. ఆ డబ్బును కొరియర్ చేసింది. అనంతరం తాను మోసపోయినట్టు గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తరణ్‌వీర్ సింగ్, రణ్వీర్ సింగ్, చమన్జ్యోత్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. మహిళ దగ్గర నుంచి దోచుకున్న మొత్తాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. జూన్ 10న ఒంటారియో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 


Updated Date - 2021-05-07T22:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising