ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. నలుగురు మృతి!

ABN, First Publish Date - 2021-04-19T11:46:02+05:30

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానా రాష్ట్రంలో జరిగిన దాడిని మరువక ముందే విస్కాన్సిన్‌లో తూటా పేలింది. కెనోషా కౌంటీలో ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గరు మరణించగా మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానా రాష్ట్రంలో జరిగిన దాడిని మరువక ముందే విస్కాన్సిన్‌లో తూటా పేలింది. కెనోషా కౌంటీలో ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గరు మరణించగా.. మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఘటనకు ముందుగా నిందితుడు బార్‌లోనే ఉన్నాడని, అయితే అతన్ని బయటకు పంపడంతో తిరిగి వచ్చి కాల్పులు జరిపినట్టు అభిప్రాయపడ్డారు. ఎవరిని చంపాలో నిందితుడు ముందుగానే నిర్ణయించుకుని ఈ దాడికి పల్పడ్డట్టు అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపిన పోలీసులు.. నిందితున్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. 


ఇదిలా ఉంటే.. ఒమహాలోని ఓ మాల్‌లో కూడా ఆదివారం రోజు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఓ మహిళ గాయపడింది. ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా.. గురువారం రోజు ఇండియానా పోలిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపలోని ‘ఫెడెక్స్’ కొరియర్ సంస్థలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-04-19T11:46:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising