ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూకే నుంచి భారత్ చేరిన 1200 ఆక్సిజన్ సిలిండర్లు

ABN, First Publish Date - 2021-05-14T02:44:54+05:30

కరోనా సెకండ్ వేవ్‌తో సతమతం అవుతున్న భారత్‌కు యూకే నుంచి వైద్య సాయం అందింది. తాజాగా బ్రిటన్ నుంచి 1200 ఆక్సిజన్ సిలిండర్లు భారత్‌కు చేరుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌తో సతమతం అవుతున్న భారత్‌కు యూకే నుంచి వైద్య సాయం అందింది. తాజాగా బ్రిటన్ నుంచి 1200 ఆక్సిజన్ సిలిండర్లు భారత్‌కు చేరుకున్నాయి. కరోనా సమయంలో దేశాన్ని ఆక్సిజన్ కొరత పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ఇలా ఆక్సిజన్ సిలిండర్లు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ షిప్‌మెంట్‌ వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. యూకే నుంచి వచ్చిన ఈ ఆక్సిజన్ సిలిండర్లను ఖతార్ ఎయిర్‌వేస్ భారత్‌కు చేర్చింది. ఈ సందర్భంగా యూకేకు ధన్యవాదాలు చెప్పిన అరిందమ్.. లాజిస్టిక్స్ సపోర్ట్ ఇచ్చిన ఖతార్ ఎయిర్‌వేస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బ్రిటిష్ ఆక్సిజన్ కంపెనీ నుంచి వచ్చిన ఈ షిప్‌మెంటు వచ్చింది. సోమవారం కూడా ఈ కంపెనీ నుంచి 1350 ఆక్సిజన్ సిలిండర్లు భారత్‌కు వచ్చాయి.

Updated Date - 2021-05-14T02:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising