ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘానిస్థాన్‌లో 100 మంది భారతీయులు మిగిలిపోయారు.. ప్రధానికి లేఖ

ABN, First Publish Date - 2021-10-25T02:19:11+05:30

తాలిబన్ల వశమైన అప్ఘానిస్థాన్‌లో ఇప్పటికీ దాదాపు 100 మంది భారతీయులు ఉన్నారంటూ ఇండియన్ వరల్డ్ ఫోరం, ఇతర ఎన్‌జీఓలు ప్రధానికి, విదేశాంగ శాఖకు లేఖ రాశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: తాలిబన్ల వశమైన అప్ఘానిస్థాన్‌లో ఇప్పటికీ దాదాపు 100 మంది భారతీయులు ఉన్నారంటూ ఇండియన్ వరల్డ్ ఫోరం, ఇతర ఎన్‌జీఓలు ప్రధానికి, విదేశాంగ శాఖకు లేఖ రాశాయి. వారందరినీ స్వదేశానికి తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరాయి. అప్ఘాన్‌లో మిగిలిపోయిన వారిలో చిన్నారులు మహిళలు కూడా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశాయి. మరో 200 మంది అఫ్ఘానిస్థానీలు కూడా భారత్‌కు వచ్చేందుకు ఎదురు చూస్తున్నారని ఇండియా వరల్డ్ ఫోరం ప్రధాని దృష్టికి తెచ్చింది. వీరందరూ ప్రభుత్వం జారీ చేసే ఈ -వీసాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తమను రక్షించాలంటూ వివిధ ఎన్‌జీఓలకు ఫోన్లు చేస్తున్నారు. అప్ఘానిస్థాన్‌ తాలిబన్ల పరమయ్యాక అప్పటివరకూ అక్కడి వారికి జారీ చేసిన వీసాలన్నిటినీ భారత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. తదుపరి జారీ చేసే ఈ-వీసాలు ఉన్నవారినే దేశంలోకి అనుమతిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో వీసాల జారీని వేగవంతం చేయాలంటూ వివిధ ఎన్‌జీఓలు ప్రధానిని కోరాయి. 

Updated Date - 2021-10-25T02:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising