ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతిరత్నాలు... అమ్మాయిలైతే!

ABN, First Publish Date - 2021-04-21T06:26:27+05:30

యువ హృదయం ఎప్పుడూ కేరింతలు కొడుతుంటుంది. స్వేచ్ఛగా విహరించాలని కోరుకుంటుంది. అలాంటి ముగ్గురు అమ్మాయిల హంగామానే ‘జాతిరత్నాలు... అమ్మాయిలైతే’ లఘుచిత్రం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువ హృదయం ఎప్పుడూ కేరింతలు కొడుతుంటుంది. స్వేచ్ఛగా విహరించాలని కోరుకుంటుంది. అలాంటి ముగ్గురు అమ్మాయిల హంగామానే ‘జాతిరత్నాలు... అమ్మాయిలైతే’ లఘుచిత్రం. ఇటీవల విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమా లైన్‌ను తీసుకుని, హాస్యం పండించేందుకు చేసిన ప్రయత్నం ఇది. ఆ చిత్రంలో నవీన్‌ పోలిశెట్టి, అతడి ఇద్దరు మిత్రులకు బదులు ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు... లైఫ్‌ను ఎంజాయ్‌ చేయాలనుకొంటారు. ఎలాగంటే... బిందాస్‌గా! అందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటారు. చివరకు ఆ రోజు రానే వస్తుంది.


ఈ కథలో నాయిక ప్రసన్న అమ్మానాన్నలు పని మీద ఊరికెళతారు. దీంతో ఎగిరి గంతేస్తుంది ఆ యువతి. ‘మా అమ్మావాళ్లు బయటకు వెళ్లిపోయారు. మనం చిల్లు కొడదాం. మీరు వచ్చేయండి’ అంటూ స్నేహితురాళ్లకు ఫోన్‌ చేస్తుంది. క్షణాల్లో అక్కడ వాలిపోతారు మన నాయిక ఇద్దరు మిత్రులు. ‘ఇప్పుడు మనం తాగుదాం’ అంటుంది తను. మిగిలిన ఇద్దరూ హుషారెత్తిపోతారు. ‘నేను మంచింగ్‌ తెస్తా’ అని ఒక స్నేహితురాలంటే... ‘మా ఆంటీవాళ్ల షాపులో నుంచి సోడా, థమ్స్‌అప్‌ నేను తీసుకొస్తా’నని మరో అమ్మాయి చెబుతుంది. ‘అయితే మందు నేను సెట్‌ చేస్తా’నంటుంది ప్రసన్న. డీల్‌ ఓకే. మందు కోసం ఓ స్నేహితుడికి ఫోన్‌ చేస్తుంది తను. ‘మీ ఇల్లు చాలా దూరం. నేను తేలేను’ అంటూ ఫోన్‌ పెట్టేస్తాడు అతడు. మరొరికి కాల్‌ చేస్తుంది. అతడూ కుదరదంటాడు. థమ్స్‌అప్‌, మంచింగ్‌ స్టఫ్‌ వస్తాయి. కానీ మందు మాత్రం రాదు. దీంతో ప్రసన్న స్నేహితురాళ్లు కోపంతో ఊగిపోతుంటారు. చివరకు కనీసం డిన్నరైనా చేద్దామనుకుంటారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తారు. ఇంతలో ప్రసన్న మదిలో బల్బు వెలుగుతుంది. డెలివరీ బాయ్‌కే ఫోన్‌ చేసి మందు తెమ్మని అడుగుతారు. అతడు షాకవుతాడు. కానీ అమ్మాయిలు అడిగారని ఠక్కున తెచ్చేస్తాడు. అవి తీసుకుని అతడికి థ్యాంక్స్‌ చెప్పి పంపించేస్తారు. బాటిల్స్‌ తీసుకుని ముగ్గురూ లోపలికి వెళతారు. పరిస్థితి పీక్‌లో ఉండగా... ఎవరో తలుపు కొడతారు. ఆ తరువాత ఏమైందన్నది ఈ షార్ట్‌ఫిలిమ్‌లో చూస్తేనే బాగుంటుంది. దీనికి కథ, దర్శకత్వం ప్రసన్న అట్కూరి. తనే లీడ్‌రోల్‌ చేసింది. ఆమె స్నేహితురాళ్లుగా అనన్యా, తనూజ నటించారు. పెద్దగా ఆకట్టుకోకపోయినా కొత్తగా ప్రయత్నించారు ఈ చిత్ర బృందం.

Updated Date - 2021-04-21T06:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising