ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకర్షణ తగ్గుతోందా!

ABN, First Publish Date - 2021-04-07T05:30:00+05:30

ప్రేమలో ఉండడం భలేగా అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి చాలా కష్టంగా తోస్తుంది. మీ అనుబంధం నవ్వుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమలో ఉండడం భలేగా అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి చాలా కష్టంగా తోస్తుంది. మీ అనుబంధం నవ్వుల తొలకరిలా, సంతృప్తిగా సాగేందుకు కొన్ని త్యాగాలు, సర్దుబాట్లు, ఎన్నో ప్రయత్నాలు అవసరమవుతాయి. అయితే రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గినప్పుడు ఒకప్పటి థ్రిల్‌ ఆవిరవుతుంది. దాంతో లవ్‌జర్నీ బోర్‌ కొడుతుంది. ఈ పరిస్థితి ఎదురవకుండా ఏం చేయాలంటే...


ఆశ్చర్యపరుస్తూ ఉండాలి: మీ ప్రియతమను సందర్భాన్ని బట్టి ఆశ్చర్యంలో ముంచెత్తడం మరచిపోవద్దు. ఇంటికి వచ్చేటప్పుడు వారికి ఒక బహుమతి తేవడం, మీ భాగస్వామికి బాగా ఇష్టమైన వంటకం మీరే వండడం, వారాంతాల్లో ఎక్కడైనా చిన్న ట్రిప్‌ ప్లాన్‌ చేయడం... ఇవన్నీ ఇద్దరి మధ్య ఆకర్షణ, ప్రేమను పెంచే ఉత్ర్పేరకాలుగా పనిచేస్తాయి. 


డేట్స్‌కు వెళ్లడం: జంటగా మారిన తొలినాళ్లలో వీలు చిక్కినప్పుడల్లా డేట్‌కి వెళతారు. ఆ తరువాత కలిసి డిన్నర్‌కు కూడా వెళ్లరు చాలామంది. దాంతో మెల్లమెల్లగా మునుపటి సంతోషం మాయమవుతుంది. అందుచేత కాసేపు కలివిడిగా గడిపేందుకు డేట్స్‌కు వెళుతుండాలి.


రొమాంటిక్‌ సందేశాలు: ఇద్దరూ ఉద్యోగం లేదా ఏదైనా పని వల్ల దూరంగా ఉన్నప్పుడు రొమాంటిక్‌ సందేశాలు పంపించుకోవాలి. ప్రేమ, వివపరీతమైన ఇష్టం, పరస్పర ప్రోత్సాహంతో కూడిన మెసేజ్‌లు ఆ దూరాన్ని తగ్గిస్తాయి. ఎప్పుడెప్పుడు కలుద్దామా అనేంతగా ఉత్సుకతను పెంచుతాయి. 


జంటగా కొత్తగా: మొదటిసారిగా ఒక రెస్టారెంట్‌కు వెళ్లడం, కొత్త వంటకం ప్రయత్నించడం, జోడీగా ఏదైనా సాహస ఆట ఆడడం ఒక కొత్త అనుభూతిని ఇవ్వడమే కాదు మీ జర్నీలో జోష్‌ని నింపుతాయి. జట్టుగా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం కూడా మీ ఇరు మనసుల జోడు నడకలో కొత్త ఉదయాలను తెస్తుంది. 


భావాలను మాటల్లో: ఏ భావాన్ని అయినా మనసులోనే దాచుకోవద్దు. మీ జతతో మీ భావాలను నిత్యం పంచుకుంటూ ఉండాలి. నవ్వులు పూయించే చిలిపిగా తోచే విషయాలైనా సరే మరచిపోవద్దు. ‘ఐ లవ్యూ’ అని చెప్పడానికి, మీ భావాలను ఉన్నది ఉన్నట్లుగా పలికించే పదాలను ఉపయోగించడానికి సిగ్గు పడొద్దు. 


ఇద్దరూ ఒక లక్ష్యంగా: జంటగా పనిచేయగలిగే లక్ష్యాలను పెట్టుకోవాలి. విహారానికి వెళ్లేందుకు, ఏదైనా పోటీలో పాల్గొనేందుకు కొంత డబ్బు పొదుపు చేయడం వంటివి ఏవైనా సరే. ఒక లక్ష్యం కోసం పనిచేయడం ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది.


Updated Date - 2021-04-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising