ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలు - పోషకాలు!

ABN, First Publish Date - 2021-03-16T05:30:00+05:30

మహిళలకు కొన్ని పోషకాలు అత్యవసరం. వీటి లోపం ఏర్పడితే కీలకమైన జీవక్రియలు అదుపు తప్పుతాయి. కాబట్టి పోషకాలు, వాటి అవసరాల గురించి అవగాహన ఏర్పరుచుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళలకు కొన్ని పోషకాలు అత్యవసరం. వీటి లోపం ఏర్పడితే కీలకమైన జీవక్రియలు అదుపు తప్పుతాయి. కాబట్టి పోషకాలు, వాటి అవసరాల గురించి అవగాహన ఏర్పరుచుకోవాలి.

ఐరన్‌: ఐరన్‌ శక్తినిస్తుంది. ఆక్సిజన్‌ శరీరంలో సక్రమంగా ప్రసరించడానికి కూడా ఐరన్‌ అవసరమే! వ్యాధినిరోధకశక్తి, కండరాల పనితీరు మెరుగుగా ఉండాలన్నా తగుమాత్రం ఐరన్‌ తీసుకోవడం తప్పనిసరి.

బి12: మెదడు, నాడీవ్యవస్థ, రక్తకణాల పనితీరుకు బి12 సరిపడా ఉండాలి. శక్తి పెరిగి, భావోద్వేగాలు అదుపులో ఉండాలన్నా బి12 తగు ప్రమాణాల్లో శరీరానికి అందాలి.

బయోటిన్‌: చర్మం, వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత బయోటిన్‌ అందేలా చూసుకోవాలి. నాడీ, జీర్ణ, గుండె సంబంధ జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా ఈ పోషకం అందాలి. 

క్యాల్షియం: బలమైన ఎముకల కోసం క్యాల్షియం అవసరం. గుండె, కండరాలు, నాడులు చురుగ్గా పని చేయాలన్నా క్యాల్షియం సరిపడా తీసుకోవాలి.

మెగ్నీషియం: నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం దొరకాలన్నా, నెలసరి సమస్యలు తొలగాలన్నా, నీరసం, ఒళ్లు నొప్పులు వదలాలన్నా మెగ్నీషియం సమృద్ధిగా తీసుకోవాలి. 

విటమిన్‌ డి: ఆహారం ద్వారా అందే క్యాల్షియం శరీరం శోషించుకోవడానికి విటమిన్‌ డి అవసరం.

Updated Date - 2021-03-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising