ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్‌ చేయకుండానే

ABN, First Publish Date - 2021-10-23T05:30:00+05:30

అకౌంట్‌ బ్లాక్‌ చేయకుండానే ఫాలోయర్‌ను తొలగించే ప్రక్రియకు ట్విట్టర్‌ శ్రీకారం చుట్టింది. మీ టైమ్‌లైన్‌, ట్వీట్స్‌ను ఎవరైనా చూడకూడదు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అకౌంట్‌ బ్లాక్‌ చేయకుండానే  ఫాలోయర్‌ను తొలగించే ప్రక్రియకు ట్విట్టర్‌ శ్రీకారం చుట్టింది. మీ టైమ్‌లైన్‌, ట్వీట్స్‌ను ఎవరైనా చూడకూడదు అనుకుంటే, ఇప్పుడిక ఆ పనిని చేయవచ్చు. అయితే, నచ్చని వ్యక్తులు అందర్నీ బ్లాక్‌ చేయడం కొందరికి ఇష్టం ఉండదు. ఆ వ్యక్తులు మాత్రం తమను ఫాలో కారాదు అనుకుంటారు. అందుకు ఈ కొత్త ఫీచర్‌  ఉపయోగపడుతుంది. దీన్నే ‘సాఫ్ట్‌ బ్లాకింగ్‌’ అని కూడా అనుకోవచ్చు. తద్వారా ఫాలోవర్స్‌పై ట్విట్టర్‌ వినియోగదారుడు కంట్రోల్‌ పొందవచ్చు. ట్రోలింగ్‌ నుంచి తప్పించుకోవచ్చు. తన ప్రైవసీని కూడా కాపాడుకోవచ్చు. ఇందుకోసం...

  1. పీసీ లేదంటే మొబైల్‌ యాప్‌లో ట్విట్టర్‌ అకౌంట్‌కి వెళ్ళాలి. 
  2. ప్రొఫైల్‌ సెక్షన్‌లోకి వెళ్ళి ఫాలోవర్స్‌ లిస్టును ఓపెన్‌ చేయాలి. 
  3. వద్దు అనుకుంటున్న ఫాలోవర్‌ను ఎంపిక చేసుకుని, పేరు పక్కన ‘త్రీ డాట్‌ మెనూ’ను టాప్‌ చేయాలి. 
  4. ఆప్షన్స్‌లో ‘రిమూవ్‌ ద ఫాలోవర్‌’ని ఎంపిక చేసుకోవాలి. 
  5. ఒకసారి ఇలా చేస్తే సదరు ఫాలోవర్‌ సంబంధిత జాబితా నుంచి మాత్రమే తొలగుతాడు. అప్పటికీ తను ప్రొఫైల్‌, ట్వీట్స్‌ను చూడగలుగుతారు. అది కూడా వద్దనుకుంటే మాత్రం ఆ ఫాలోవర్‌ను బ్లాక్‌ చేయాల్సిందే. 

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising