ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసప్పియరింగ్‌ మెసేజ్‌లు మళ్లీ ప్రత్యక్షం!

ABN, First Publish Date - 2021-09-18T06:13:31+05:30

వాట్సాప్‌ ‘డిసప్పియరింగ్‌ మోడ్‌’ అప్‌గ్రేడ్‌ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు ఉన్న ఫీచర్‌ ప్రకారం మెసేజ్‌ పంపిన వారం రోజులకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాట్సాప్‌ ‘డిసప్పియరింగ్‌ మోడ్‌’ అప్‌గ్రేడ్‌ అవుతున్నట్టు సమాచారం.  ఇప్పటికిప్పుడు ఉన్న ఫీచర్‌ ప్రకారం మెసేజ్‌ పంపిన వారం రోజులకు అది మాయమవుతుంది. అయితే దీనికి మరింత మెరుగులుదిద్దే పనిలో వాట్సాప్‌ ఉంది. ఈ సౌకర్యం ఇటు వ్యక్తిగత, అటు గ్రూప్‌ చాట్స్‌కు అందుబాటులో ఉంది. డిసప్పియరింగ్‌ మోడ్‌ను టర్న్‌ఆన్‌ చేసిన పక్షంలో మెసేజ్‌ అందుకున్న వారం రోజుల్లో అదృశ్యమవుతాయి. అయితే దీనిని టర్న్‌ఆఫ్‌ చేస్తే ఇంతకు ముందు మాయం అయిన మెసేజ్‌లు అన్నీ మళ్లీ అక్కడ ప్రత్యక్షం అవుతాయి.  డబ్ల్యూఎబేటాఇన్ఫో విడుదల చేసిన స్ర్కీన్‌షాట్‌ ప్రకారం, మాయం కావడానికి సంబంధించి టైమర్‌ ఆప్షన్‌కూడా ఉండనుంది. దీని ప్రకారం ఒక వారం అని కాకుండా నిర్దేశించుకునే సమయం తరవాతే సెండర్‌ పంపిన మెసేజ్‌ మాయమవుతుంది. దీని ప్రకారం నాలుగు టైమ్‌ ఆప్షన్లు 24 గంటల నుంచి 90 రోజుల వరకు ఉంటాయి. ఇప్పటికైతే ఇండివిడ్యువల్‌ చాట్స్‌ కోసం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ అలాగే ఐఓఎస్‌ ఆధారిత యాప్స్‌ కోసం అభివృద్ధిపరుస్తున్నారు. గ్రూప్‌ చాట్‌ విషయమై మాత్రం వాట్సాప్‌ నుంచి ఏమీ సమాచారం లేదు. ఒకసారి టెస్టింగ్‌ పూర్తయితే చాలు, వాట్సాప్‌ మెయిన్‌ యాప్‌లోకి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది. 

Updated Date - 2021-09-18T06:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising