ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కురులు త్వరగా ఆరాలంటే!

ABN, First Publish Date - 2021-02-01T05:41:58+05:30

కొన్నిసార్లు హడావిడిగా రెడీ అవుతాం. అప్పుడు జుట్టు త్వరగా ఆరబెట్టుకునేందుకు ఎక్కువ సేపు హెయిర్‌ డ్రైయ్యర్‌ ఉపయోగిస్తాం. దాంతో వేడికి కురులు దెబ్బతినే అవకాశముంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు హడావిడిగా రెడీ అవుతాం. అప్పుడు జుట్టు త్వరగా ఆరబెట్టుకునేందుకు ఎక్కువ సేపు హెయిర్‌ డ్రైయ్యర్‌ ఉపయోగిస్తాం. దాంతో వేడికి కురులు దెబ్బతినే అవకాశముంది. అందుచేత సహజంగానే వెంట్రుకలు ఆరేందుకు ఏం చేయాలంటే...


ఒళ్లు తుడుచుకునే తువ్వాలుతోనే జుట్టు తుడుచుకోవద్దు. ఎందుకంటే ఆ టవల్‌ వెంట్రుకల క్యుటికిల్‌ను దెబ్బతీసి గరుకుగా మారుస్తుంది. అందుకే జట్టు ఆరబెట్టుకునేందుకు మెత్తని పోగులున్న తువ్వాలు వాడాలి. అది నీటిని ఎక్కువగా పీల్చుకొంటుంది. కురులు త్వరగా ఆరతాయి.

తలస్నానం చేసిన తరువాత జుట్టు ఆరబెట్టుకోవడమే పనిగా పెట్టుకోవద్దు. దుస్తులు సిద్ధంగా ఉంచుకోవడం, మేకప్‌ వేసుకోవడం వంటి పనులు చేసుకోవాలి. ఆ లోపు జుట్టు కొద్దిగా ఆరుతుంది. అప్పటికీ తడిగా ఉంటే మైక్రోఫైబర్‌ టవల్‌తో తుడుచుకుంటే సరి. 

ఎక్కువ సమయం టవల్‌ చుట్టి ఉంచవద్దు. టవల్‌ తీసేటప్పుడు జుట్టు రాలిపోయే వీలుంది. కాబట్టి కండిషనింగ్‌ చేసుకుంటే ఏ సమస్యా ఉండదు. కురులూ దెబ్బతినవు.

వెంట్రుకలు త్వరగా ఆరేందుకు చన్నీళ్లు పనికొస్తాయి. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు తెరచుకుంటాయి. కండిషనింగ్‌ చేసుకునే ముందు చన్నీళ్లతో జుట్టు శుభ్రం చేసుకుంటే కుదుళ్లు మూతపడి కురులు తొందరగా ఆరతాయి.

Updated Date - 2021-02-01T05:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising