ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీళ్లు.. మేళ్లు..

ABN, First Publish Date - 2021-10-19T05:30:00+05:30

దాహం వేసినప్పుడే కాదు, వేయనప్పుడూ నీళ్లు తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గి, ప్రతి అణువూ నీటి కోసం అల్లాడిపోతూ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాహం వేసినప్పుడే కాదు, వేయనప్పుడూ నీళ్లు తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గి, ప్రతి అణువూ నీటి కోసం అల్లాడిపోతూ, దాహం ద్వారా మనకు నీళ్లు తాగే విషయాన్ని గుర్తు చేసే సమయానికంటే ముందే నీళ్లు తాగడం అవసరం. నీళ్లదేముంది? వాటి వల్ల ఉపయోగాలేముంటాయి? అని కొట్టిపారేయకండి. నీటితోనూ కొన్ని ప్రయోజనాలున్నాయి.

  1. గుండె పనితీరు భేషుగ్గా ఉండాలంటే సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.
  2. రక్తప్రసరణ మెరుగ్గా జరగాలంటే శరీరంలో అందుకు సరిపడా నీరుండాలి.
  3. శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు సాఫీగా బయటకు వెళ్లిపోవాలంటే తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి.
  4. తినే ఆహారంలోని పోషకాలను శరీరం శోషణ చేసుకోవాలన్నా నీరు తాగవలసిందే!
  5. కండరాలు, ఎముకల దృఢత్వం కోసం నీళ్లు తాగడం అవసరం. నీటి కొరత వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వేధిస్తాయి.
  6. మెదడు పనితీరు మెరుగ్గా ఉండడం కోసం, ఆలోచనల్లో స్పష్టత లోపించకుండా ఉండడం కోసం నీరు తాగడం అవసరం.
  7. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండాలన్నా సరిపడా నీరు తాగాలి.
  8. నోటి దుర్వాసన వేధించకుండా ఉండాలన్నా నీళ్తు సరిపడా తాగుతూ ఉండాలి.

Updated Date - 2021-10-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising