ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విటమిన్ల లేమిని శరీరం చెప్పేస్తుంది!

ABN, First Publish Date - 2021-11-25T05:30:00+05:30

మనం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు అత్యవసరం. ఇవి తగినంత మోతాదులో లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు అత్యవసరం. ఇవి తగినంత మోతాదులో లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలు మన శరీరంపై స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కొద్ది పాటి శ్రద్ధతో ఈ లక్షణాలను గమనిస్తే మనకున్న విటమిన్‌ లోపాలన్నీ తెలిసిపోతాయి. 


చర్మంపై పొక్కులు

ఆరోగ్యవంతుల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. చర్మం పొడిగా ఉండి.. చిన్న చిన్న పొక్కులు వస్తూ ఉంటే- విటమిన్‌ లోపం ఉన్నట్లు కచ్చితంగా చెప్పవచ్చు. సాధారణంగా బీ12 విటమిన్‌ తక్కువగా ఉంటే చర్మం పొడిగా ఉంటుంది. విటమిన్‌ ఏ, విటమిన్‌ ఈలు తక్కువగా ఉంటే చర్మంపై పొక్కులు వస్తాయి. అందువల్ల చర్మంపై పొక్కులు వచ్చినవారు- విటమిన్లపై శ్రద్ధ పెడితే మంచిది. 


ఎర్రటి కళ్లు..

సాధారణంగా ఎలర్జీ వస్తే కళ్లు ఎర్రగా అవుతాయి. అయితే కొందరికి ఉదయాన్నే లేచిన వెంటనే కళ్లు ఎర్రగా అవుతాయి. ఐయిడిన్‌ శాతం తక్కువ ఉన్నా.. విటమిన్‌ ఏ తక్కువగా ఉన్నా- కళ్లు ఎర్రబడే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల ఎటువంటి అలర్జీ లేకుండా కళ్లు ఎర్రపడుతుంటే విటమిన్‌ లోపం ఉండే అవకాశముంది. 


చిగుళ్లలో రక్తం..

విటమిన్‌ సి లోపం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా విటమిన్‌ సి తక్కువగా ఉంటే చిగుళ్ల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. రక్తం కారటంతో పాటుగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు కూడా ఉంటే విటమిన్‌ సి తక్కువున్నట్లే లెక్క. ఈ విటమిన్‌ను పెంచుకోవాలంటే పుల్లటి పళ్లను తినాలి.

 

వెంట్రుకలు తెగిపోతుంటే..

వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే బయోటిన్‌ అనే పౌష్టికపదార్థం అవసరం. దీనినే విటమిన్‌ బీ7 అని కూడా అంటారు. బయోటిన్‌ విలువలు తక్కువగా ఉండటం వల్ల వెంట్రుకలు బలహీనపడతాయి. రాలిపోతుంటాయి. లేదా వెంట్రుకలు ముక్కలుగా తెగిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితి వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.


పెదవులు పాలిపోతే..

శరీరంలో ఐరన్‌ శాతం తగ్గితే పెదవులు తెల్లబడతాయి. ఐరన్‌ శాతం తగ్గితే  శరీరంలోని వివిధ అవయవాలకు వెళ్లే రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గుతుంది. దీని వల్ల చర్మం, పెదవుల రంగు మారుతుంది. పెదవులు పాలిపోయినట్లు ఉన్నవారు రక్తంలో తగినంత ఐరన్‌ ఉందా? లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. 


Updated Date - 2021-11-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising