ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల్లో ఒత్తిడిని తగ్గించాలంటే!

ABN, First Publish Date - 2021-05-01T05:32:24+05:30

కరోనా భయాలు పెద్దలనే కాదు పిల్లలను కూడా కలవరపెడతాయి. ఎక్కువ సమయం ఇంటిపట్టునే ఉండాల్సి రావడంతో వారు ఎంతోకొంత ఒత్తిడిగా కనిపిస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా భయాలు పెద్దలనే కాదు పిల్లలను కూడా కలవరపెడతాయి. ఎక్కువ సమయం ఇంటిపట్టునే ఉండాల్సి రావడంతో వారు ఎంతోకొంత ఒత్తిడిగా కనిపిస్తుంటారు. ఈలాంటి సమయంలో కన్నవాళ్లు పిల్లలకు ధైర్యం చెబుతూ వారిలో మానసిక స్థైర్యాన్ని నింపాలి. అందుకు ఏం చేయాలంటే...


ఓపికగా వినాలి: కరోనా గురించి పిల్లలు అడిగే ప్రశ్నలను విని వారిలోని భయాలను పోగొట్టాలి. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని, తాము ఒంటిరి అనే భావన పసి మనసుల్లో కలగకుండా చూడాలి. కథలు చదివించడం, ఫన్‌ గేమ్స్‌ వంటివి ఆటవిడుపుతో పాటు వారిలో ఉల్లాసాన్ని పెంచుతాయి. 


స్నేహితులతో మాట్లాడించాలి: ఈ సమయంలో పిల్లలను బయటకు వెళ్లకుండా చూడడం మంచిదే. అయితే స్నేహితులతో ఫోన్‌, వీడియో కాల్స్‌లో మాట్లాడించడం ద్వారా వారు జాలీగా ఉంటారు. అలాగే వర్చ్యువల్‌గా ఫ్రెండ్స్‌తో ఏదైనా గేమ్‌ ఆడించినా కూడా పిల్లల్లో జోష్‌ పెరుగుతుంది. 


భావోద్వేగాలను పసిగట్టాలి: ఊరికే కోప్పడుతున్నా, దిగాలుగా ఉంటున్నా వారిపై అరవొద్దు. వారి ఉద్రేకాన్ని తగ్గించాలి. ఏం మాట్లాడితే ఏం అంటారో అనే బెరుకును దూరం చేయాలి. కరోనా, వ్యాక్సిన్‌ గురించి పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి వారిలో అవగాహన  కలిగించాలి. 


బోర్‌ కొట్టకుండా: ఇంట్లో రోజంతా ఉండాలంటే పిల్లలకు ఏమీ తోచదు. ఈ సమయాన్ని పిల్లల ఆసక్తులు, హాబీలలో మెరుగుపడేందుకు తల్లిదండ్రులు చేయందించాలి. అలాగే వంట, గార్డెనింగ్‌లో భాగం చేస్తే పిల్లలకు నైపుణ్యాలు అలవడతాయి. 


చదువూ ముఖ్యమే: ఆన్‌లైన్‌ తరగతులు సరిగ్గా వినేలా చూడడం, వారి అనుమానాలను నివృత్తి చేయడం వల్ల పిల్లలు చదువులో వెనకబడకుండా చూడొచ్చు.

Updated Date - 2021-05-01T05:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising