ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవ్వు పెరగకూడదంటే..!

ABN, First Publish Date - 2021-04-22T05:30:00+05:30

నచ్చిన ఫుడ్‌ ఇష్టంగా లాగించేస్తుంటారు. తరువాత అదనంగా చేరిన కొవ్వును తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడుతుంటారు. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నచ్చిన ఫుడ్‌ ఇష్టంగా లాగించేస్తుంటారు. తరువాత అదనంగా చేరిన కొవ్వును తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడుతుంటారు. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ సంబంధ సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. 


  1. వంటనూనె ఒకే రకమైనది కాకుండా మార్చుకుంటుండాలి. ఒకసారి రైస్‌బ్రౌన్‌ అయిల్‌ తీసుకుంటే మరొకసారి గ్రౌండ్‌నట్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఇలా మార్చుకుంటూ వాడుకోవాలి.
  2. వెల్లుల్లిలో ఐసిన్‌ అనే యాంటిఅక్సిడెంట్‌ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్‌ ఏర్పడకుండా కాపాడుతుంది. 
  3. వారంలో రెండు రోజులు చేపలు తినాలి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభిస్తుంది. ఇది రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్‌ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. 
  4. ఆలివ్‌ ఆయిల్‌ లో మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి. 
  5. గోధుమలో ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఫైబర్‌ కొలెస్ట్రాల్‌తో బైండ్‌ అయి శరీరం నుంచి బయటకు పంపుతుంది. ఫైబర్‌ గోధుమలోనే కాకుండా ఓట్స్‌, బార్లీ, జొన్నలు, రాగుల్లోనూ సమృద్ధిగా ఉంటుంది.
  6. సాధారణంగా ప్రతీ ఒక్కరికీ రోజూ ఇరవై గ్రాముల ఫ్యాట్‌ అవసరం అవుతుంది. ఇది రోజూ వంట నూనెలో లభిస్తుంది. ఇది శరీరానికి సరిపోతుంది. కాబట్టి ఇతర ఆహార పదార్థాల్లో అదనంగా లభించే ఫ్యాట్‌ను తగ్గించుకోవడంపై దృష్టి సారించాలి. 
  7. పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. పాల ఉత్పత్తులో ఫ్యాటీ యాసిడ్స్‌ యాంటీ అక్సిడెంట్లు, పాలిఫెనాల్స్‌ ఉంటాయి. పాలిఫెనాల్స్‌ రక్తపోటును నియంత్రణలో ఉంచి. గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. 
  8. పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలలో విటమిన్‌ బి కాంప్లెక్స్‌, నియాసిన్‌ ఉంటుంది. ఇది క్లాట్స్‌ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. 
  9. రోజూ ఒక ఆపిల్‌ తినడం అలవాటు చేసుకోవాలి. ఆపిల్‌లో ఐరన్‌, ఫాస్పరస్‌, కాల్షియం, పొటాషియం, విటమిన్‌ఎ, బి, సి ఉంటాయి. 
  10. ఈ ఆహార నియమాలతో పాటు క్రమం తప్పకుండా రోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలి. 

Updated Date - 2021-04-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising