ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గులాబీ మొక్కలు పెంచుతున్నారా!

ABN, First Publish Date - 2021-04-26T05:30:00+05:30

రంగురంగుల్లో ఉండే గులాబీ పూలు ఇట్టే మనసుకు నచ్చేస్తాయి. అందుకే ఎక్కువ మంది రోజ్‌ గార్డెన్‌ను పెంచేందుకు ఆసక్తి చూపుతారు. అయితే తక్కువ స్థలం ఉన్నవాళ్లు గులాబీ మొక్కలను ఎండ తగిలే చోట పెట్టాలి. గులాబీతో పాటు చామంతి, పెటోనియా, సాల్వియా, లిల్లీ, స్పైడర్‌ లిల్లీలను అలంకరణ మొక్కలుగా పెంచుకోవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగురంగుల్లో ఉండే గులాబీ పూలు ఇట్టే మనసుకు నచ్చేస్తాయి. అందుకే ఎక్కువ మంది రోజ్‌ గార్డెన్‌ను పెంచేందుకు ఆసక్తి చూపుతారు. అయితే తక్కువ స్థలం ఉన్నవాళ్లు గులాబీ మొక్కలను ఎండ తగిలే చోట పెట్టాలి. గులాబీతో పాటు చామంతి, పెటోనియా, సాల్వియా, లిల్లీ, స్పైడర్‌ లిల్లీలను అలంకరణ మొక్కలుగా పెంచుకోవచ్చు. 


  1. గులాబీ మొక్కలను పెంచేందుకు 30శాతం కోకోపిట్‌, 30శాతం మట్టి, 20 శాతం ఇసుక, 10 శాతం వర్మీకంపోస్ట్‌ తీసుకోవాలి. పూల మొక్కలకు తక్కువ పోషణ సరిపోతుంది కాబట్టి వర్మీకంపోస్ట్‌ తక్కువ అవసరం పడుతుంది. 18/18 ఇంచుల కుండీలలో గులాబీ మొక్క చక్కగా పెరుగుతుంది. దాదాపు ఎనిమిది గంటల ఎండ తగలాలి. కాండం భాగంలో వచ్చిన కొమ్మలను ప్రతి 20-25 రోజులకు సెకేచర్‌తో కత్తిరించాలి. ఎండిపోయిన గులాబీ పూలను చాలామంది చేతితో తెంపుతుంటారు. అలాకాకుండా సెకేచర్‌ కత్తెరతో కత్తిరించి అక్కడ పసుపు రాయాలి. దాంతో నాలుగు అయిదు మొగ్గలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే చేతితో తెంపితే ఇగురు వస్తుంది తప్ప కొత్తగా మొగ్గలు రావు. నాటు గులాబీ కన్నా గ్రాఫ్టింగ్‌ గులాబీలో పలు రంగులు దొరకుతాయి. బ్రిటీష్‌ క్వీన్‌ రకం చాలా బాగుంటుంది. 
  2. గులాబీ మొక్కకు ఎరువుగా ఆవుపేడ వేయాలి. అదికూడా పొడిగా ఉన్నదే వేయాలి. అలాగే నేరుగా గులాబీ మొక్కకు నీళ్లు పోయొద్దు. తొట్టి నిండా నీళ్లు పోయడం వల్ల కింద కాండం దగ్గర గట్టిదనం వస్తుంది. మొక్క ఎక్కువగా పెరగదు. మార్కెట్లో లీటరు స్ర్పే బాటిళ్లు రూ. 300లకు దొరకుతాయి. వాటిలో నీటిని నింపి గులాబీ కొమ్మల మీద చల్లాలి. ప్రతి 25 రోజులకు మల్చింగ్‌ చేయాలి. లేదంటే కలపు మొక్కలు పెరిగే అవకాశం ఉంది. కలుపు మొక్కలు పెరిగితే దోమలు వస్తాయి.  వెజిటబుల్‌ గార్డెన్‌కు రోజ్‌గార్డెన్‌ రెండూ పక్కపక్కనే ఉండకూడదు. ఎందుకంటే మిల్లీబడ్స్‌ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గులాబీ మొక్కకు ఒకే చోట నాలుగైదు కొమ్మలు వచ్చినప్పుడు సెకేచర్‌తో కత్తిరించాలి. గోధుమ, చాక్లెట్‌ రంగులో కొత్త ఆకులు వచ్చిన కొమ్మలను సెకేచర్‌తో కత్తిరించినప్పుడు ఎక్కువ మొగ్గలు వచ్చే అవకాశం ఉంది. 
  3. చామంతి సంవత్సరమంతా పూస్తుంది. దీనిని గుండ్రని కుండీల్లో పెంచలేం. గుంపుగా పెరిగే ఈ మొక్కను  దీర్ఘచతురస్రాకార కుండీలలో పెంచాలి. కావాలంటే ఎల్‌ ఆకారంలో టెర్రస్‌ మీద డిజైన్‌ చేసుకోవచ్చు. ఒకవేళ గుండ్రని కుండీల్లో పెంచాలనుకుంటే ఒక అంచున కాకుండా టెర్రస్‌ మధ్యలో ఉంచితే గార్డెన్‌ లుక్‌ వస్తుంది. లేదంటే ఎరుపు, తెలుపు, పసుపు, గులాబీ రకాలను డిజైన్‌ చేసుకుంటే కనువిందుగా కనిపిస్తుంది. 

- కె.పి.రావు

ప్రముఖ ల్యాండ్‌స్కేప్‌ డిజైనర్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌

8019411199


Updated Date - 2021-04-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising