ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్మాన్ని ఇలా కాపాడుకుందాం!

ABN, First Publish Date - 2021-04-28T05:43:44+05:30

వాతావరణంలో మార్పులతో పాటే చర్మం అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. వేసవిలో తీక్షణంగా ఉండే సూర్య కిరణాల నుంచి చర్మం నునుపునూ, మెరుపునూ కాపాడుకోవడం కష్టమవుతుంది. అలంటప్పుడు ఏం చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాతావరణంలో మార్పులతో పాటే చర్మం అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. వేసవిలో తీక్షణంగా ఉండే సూర్య కిరణాల నుంచి చర్మం నునుపునూ, మెరుపునూ కాపాడుకోవడం కష్టమవుతుంది. అలంటప్పుడు ఏం చేయాలంటే...


  1. వేసవిలో చర్మం మీద తేమ బాగా తగ్గిపోతుంది. కాబట్టి ఈ సీజన్‌లో రోజుకు కనీసం పది నుంచి పన్నెండు గ్లాసుల నీరు తాగాలన్నది వైద్య నిపుణుల సూచన. పండ్లు ఎక్కువగా తింటే డీహైడ్రేషన్‌ నుంచి తప్పించుకోవచ్చు. 
  2. రాత్రి నిద్రపోయే ముందు క్లీన్సింగ్‌, మాశ్చరైజింగ్‌ చేసుకోవాలి. చర్మానికి సహజమైన మాశ్చరైజర్లు అయిన పాలు, తేనె ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. అలాగే రోజులో కనీసం రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. 
  3. బయటకు వెళ్ళేటప్పుడు సన్‌ స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవాలి. సన్‌స్ర్కీన్‌ హానికరమైన అలా్ట్రవయొలెట్‌ రేడియేషన్‌ నుంచి రక్షణ ఇస్తుంది. వయసు ఛాయలు కనిపించకుండా చేస్తుంది. 
  4. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే టొమాటో, విటమిన్‌ ‘సి’ ఉన్న నిమ్మ రసం లాంటివి తాగడం మంచిది. టొమాటో గుజ్జు, కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకొని, పది నిమిషాల తరువాత కడుక్కుంటే చర్మం చల్లబడుతుంది.   
  5. పాలు, తేనే, ఓట్స్‌ లాంటి వాటితో ఫేస్‌ మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. వీటివల్ల చర్మం మృదువుగా మారుతుంది. తగినంత తేమ అందుతుంది. 
  6. తొందరగా చెమట పట్టే ఈ కాలంలో మేకప్‌ తక్కువగా వేసుకోవడమే మంచిది. 

Updated Date - 2021-04-28T05:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising