ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనసు మతలబు సంకేతాలివి!

ABN, First Publish Date - 2021-03-31T06:06:09+05:30

ప్రేమ భాష ఏంటో... తొందరగా అర్థమవదు. కానీ కొన్ని సంకేతాలతో మనసు పరవశాన్ని పసిగట్టడం సాధ్యమే. ఎవరైనా విమ్మల్ని పదేపదే చూస్తున్నారని, అస్తమానం మీ గురించే ఆలోచిస్తున్నారని అనిపిస్తుంది ఒక్కోసారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ భాష ఏంటో... తొందరగా అర్థమవదు. కానీ కొన్ని సంకేతాలతో మనసు పరవశాన్ని పసిగట్టడం సాధ్యమే. ఎవరైనా విమ్మల్ని పదేపదే చూస్తున్నారని, అస్తమానం మీ గురించే ఆలోచిస్తున్నారని అనిపిస్తుంది ఒక్కోసారి. అయితే వారి మనసులో మీరు ఉన్నారన్న సంగతి కనిపెట్టడం ఎలా? ఫలానా వారు మిమ్మల్ని ఆరాధిస్తున్నారనే విషయాన్ని కొన్ని లక్షణాలతో తెలుసుకోవచ్చు అంటున్నారు లవ్‌గురూలు.  


తెలియకుండానే నవ్వడం: మీ మనసు చెప్పినట్టుగా మీ శరీరం చేస్తుంది. మీరు ఎవరినైనా చూసి వారిని గుర్తుపట్టినప్పుడు వారి ముఖంలో వేల బల్బుల వెలుగు నిండిన నవ్వు విరుస్తుంది. మిమ్మల్ని చూడగానే వారి మోము నవ్వుతో వెలిగిపోతుంది. అప్పుడు మీ మనసు వారు మీ ఊహల్లో విహరిస్తున్నారని మీకు చెబుతుంది. 


భావోద్వేగాల్లో మార్పు: మీ ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు గమనించారా? హుషారుగా ఉంటూ, జోకులు వేస్తూ రోజంతా పాజిటివ్‌గా గడిపే మీరు ఆకస్మికంగా ఒత్తిడికి లోనవడం, ఎవరో మీ ఉత్సాహాన్ని తోడేస్తున్నట్టుగా అనిపించడం.. ఇవన్నీ. మీ మనసులో ఎవరో ఉన్నారనే దానికి సంకేతాలు. 


ఇద్దరూ దగ్గరవడం: మీ ఇద్దరిని దగ్గర చేసే అంశం ఏంటో ముందుగా అర్థం చేసుకోవాలి. అది కూడా మీ మెదడు ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. ఎవరినైనా ప్రేమించాలనుకుంటే వాళ్లు తమకు అన్నివిధాలా సరిపోతారా? అనేది ఆలోచిస్తారు. ఎవరితో అయితే జీవితం బాగుంటుందని అనిపిస్తుందో వారితో జట్టు కడతారు. అలా ప్రేమలో పడడం మీకు తెలియకుండానే జరిగిపోతుంది. 

 

కనుల కదలికలు: మీ కళ్ల భాష మారినప్పుడు మీ మెదడు ఏదో జరగనుందని ఊహిస్తుంది. అకస్మాత్తుగా కళ్లు అదరడం, దురద పెడుతున్నాయంటే మీ గురించి ఎవరో ఆలోచిస్తున్నారన్నమాట. అయితే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారి గానీ, మీ గురించి మంచిగా లేదంటే చెడుగా చెబుతన్నారని గానీ చెప్పలేం.


వేడెక్కే బుర్ర: ఎవరైనా మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నారని తెలియగానే మనసంతా కలవరపాటు మొదలవుతుంది. తెలియని ఆందోళనతో గందరగోళంగా అనిపిస్తుంది. గుండెదడ పెరగడం, ఉలికిపాటులు ప్రేమ తాలూకూ సంకేతాలే. అంతెందుకు వెక్కిళ్లు కూడా మిమ్మల్ని ఎవరో తలచుకుంటున్నారని చెప్పేవే. 

Updated Date - 2021-03-31T06:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising