ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెర్పిస్‌ ఛాయలే ఉండవు!

ABN, First Publish Date - 2021-02-16T08:43:50+05:30

జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, జననావయవాల్లో మంట, దురద హెర్పిస్‌ లక్షణాలు. మందులు వాడినప్పుడు తగ్గినట్టే తగ్గి తిరగబెడుతూ ఉంటుంది. అయితే ఆధునిక హోమియో చికిత్సతో హెర్పిస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, జననావయవాల్లో మంట, దురద హెర్పిస్‌ లక్షణాలు. మందులు వాడినప్పుడు తగ్గినట్టే తగ్గి తిరగబెడుతూ ఉంటుంది. అయితే ఆధునిక హోమియో చికిత్సతో హెర్పిస్‌ ఛాయలే లేకుండా చేయవచ్చని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ మధు వారణాశి.


అతి సూక్ష్మమైన హెర్పిస్‌ సింప్లెక్స్‌ అనే వైరస్‌లో హెచ్‌ఎస్‌వి 1, హెచ్‌ఎస్‌వి 2 అనే రెండు రకాలుంటాయి. హెచ్‌ఎస్‌వి 1 నోటి దగ్గర పెదవుల చుట్టూ తెల్లని నీటి పొక్కుల రూపంలో బయల్పడుతుంది. పిల్లల్లో కనిపించే ఈ వ్యాధి వచ్చి పోతూ ఉంటుంది. జననావయవాల దగ్గర పొక్కులతో బయల్పడే హెచ్‌ఎస్‌వి 2 జెనైటల్‌ హెర్పిస్‌. కలయిక సమయంలో చర్మం చిట్లినప్పుడు పుండ్లు, గాయాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ వెన్నెముక చివర, శాక్రమ్‌ నాడుల సముదాయంలో తిష్టవేసి నిద్రావస్థలో ఉండిపోతుంది. రోగనిరోధకశక్తి బలహీనపడినప్పుడు, మానసిక, శారీరక ఒత్తిళ్లు పెరిగినప్పుడు, వాతావరణ పరిస్థితులు మారినప్పుడు లేదా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈ వ్యాధి సుడిగాలిలా విజృంభిస్తుంది. 


లక్షణాలు: తొలిదశలో జననాంగంలో నొప్పి, మంట, ఒళ్లు నొప్పులు, గజ్జల్లో, చంకల్లో గడ్డలు ఏర్పడతాయి. లైంగిక అవయవాలపై చిన్న నీటి పొక్కులు ఏర్పడతాయి. ఇవి మూడు రోజుల్లో పగిలి పుండ్లుగా మారతాయి. కొంతమందిలో తగ్గుతూ, తలెత్తుతూ రికరెంట్‌ ఎటాక్స్‌తో వేధిస్తుంది.


హెర్పిస్‌ రికరెంట్‌ అటాక్స్‌: ఈ రకం ఎటాక్స్‌లో లక్షణాల తీవ్రత తక్కువ. అయితే పుండ్లు పగిలి, మానిపోయినా, వాటి నుంచి వచ్చిన రసిక లైంగిక సంపర్కం ద్వారా ఇతరులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. స్త్రీలలో నెలసరి రక్తస్రావం కారణంగా పొక్కులు ఉన్నా తెలియవు. పైకి కనిపించకపోయినా లోలోపల హెర్పిస్‌ ఉంటుంది.


నిర్థారణ ఇలా...

అపరిచిత వ్యక్తులతో లైంగికంగా కలిసిన వారం రోజుల్లో నీటి పొక్కులు ఏర్పడి తగ్గి, మళ్లీ తలెత్తుతాయి. పీసీఆర్‌ టెస్ట్‌, హెచ్‌ఎస్‌వి 1, 2, ఐజీజీ, ఐజీఎమ్‌ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్థారించవచ్చు. పుండ్ల దగ్గరి స్రావాలు సేకరించి కల్చర్‌ టెస్ట్‌, డీఎన్‌ఎ టెస్ట్‌, యూరిన్‌ టెస్ట్‌ పరీక్షలతో కూడా నిర్థారించుకోవచ్చు.


దుష్పరిణామాలు

గర్భిణులకు మొదటి నెలలో హెర్పిస్‌ సోకితే గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. ప్రసవ సమయంలో పుట్టే పిల్లలకు తల్లి నుంచి సోకుతుంది. దీన్నే నియోనాటల్‌ హెర్పిస్‌ అంటారు. వెన్నెముకలోని నాడీ మండలానికి హెర్పిస్‌ సోకితే అంగస్తంభన సమస్య ఎదురుకావచ్చు. కొందరికి నాడీమండలంలో హెర్పిస్‌ వచ్చి మెనింగ్జయిటిస్‌కు కారణం కావచ్చు.


హోమియో చికిత్స

మూలకారణాన్ని తొలగించే హోమియో చికిత్సతో అద్భుతమైన పరిష్కారం దక్కుతుంది. ఈ చికిత్స రోగనిరోధకవ్యవస్థను బలపరిచి సులువుగా వ్యాధిని నివారిస్తుంది. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల నేతృత్వంలో చికిత్స తీసుకుంటే హెర్పిస్‌ ఛాయలే లేకుండా పోతాయి.


డా. మధు వారణాశి

MD, MS(PSYCHO), MCSEP

 ప్రముఖ హోమియో వైద్యులు

ప్లాట్‌నెం 188, వివేకానందనగర్‌ కాలనీ

కూకట్‌పల్లి, హైదరాబాద్‌

ఫోన్‌ : 8897331110, 8886509509

Updated Date - 2021-02-16T08:43:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising