ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొదుపు విలువ చెప్పండిలా..!

ABN, First Publish Date - 2021-09-12T05:30:00+05:30

పిల్లలకు చిన్న వయసులోనే పొదుపు అలవాట్లను నేర్పించాలి. ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో వివరించాలి. పిల్లలకు ఇంకా ఏం చెప్పాలంటే.... ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలకు చిన్న వయసులోనే పొదుపు అలవాట్లను నేర్పించాలి. ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో వివరించాలి. పిల్లలకు ఇంకా ఏం చెప్పాలంటే....


  1. డబ్బు ఎలా పొదుపు చేయాలి? ఎలా ఖర్చు చేయాలి? ఈ విషయాలను చిన్న వయసులోనే నేర్పించాలి. పిల్లలకు డబ్బు విలువ తెలియకపోతే పెద్దయ్యాక ఇబ్బందులు పడతారు. 
  2. పొదుపు చేయడం కూడా ఒకరకమైన సంపాదనే. దుబారా ఖర్చు చేయకుండా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పాలి. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనీ మేనేజ్‌మెంట్‌ ఎలా చేసుకోవాలో చెప్పాలి. 
  3. అవసరాలకు, ఆశలకు చాలా తేడా ఉంటుంది. అవసరాలకు వస్తువులు కావాల్సి ఉంటుంది. అలాంటివి తప్పక ఉండాల్సిందే. కానీ కొన్ని వస్తువులు అవసరం ఉండదు. అయినా వాటిని కోరుకుంటారు. ఆ వ్యత్యాసాన్ని పిల్లలకు వివరించాలి.
  4. పిల్లలకు ఐదేళ్ల వయసులో నుంచే కొంత పాకెట్‌ మనీ ఇవ్వడం చేయాలి. ఖర్చు విషయంలో ఎలా ఉండాలో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇది సులువైన మార్గం.
  5. పిగ్గీ బ్యాంక్‌ కొనిచ్చి అందులో డబ్బు దాచుకునేలా ప్రోత్సహించాలి. మోనోపోలి వంటి మనీ గేమ్‌లను ఆడేలా పిల్లలను ప్రోత్సహించాలి.
  6. పిల్లలకు కొంత డబ్బు ఇచ్చి పండ్లు, కూరగాయలు కొనడం అలవాటు చేయాలి. డబ్బు నిర్వహణ గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది.
  7. నీ మేనేజ్‌మెంట్‌లో తల్లిదండ్రులు పిల్లలకు రోల్‌ మోడల్‌గా ఉండాలి. ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాన్ని పిల్లలకు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల హార్డ్‌ వర్క్‌ ప్రాముఖ్యత పిల్లలకు తెలుస్తుంది.

Updated Date - 2021-09-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising