ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుస్మితతో పెళ్లి.. కాలమే నిర్ణయిస్తుంది

ABN, First Publish Date - 2021-02-07T06:18:26+05:30

బాలీవుడ్‌ నటి, మాజీ మిస్‌ వరల్డ్‌ సుస్మితసేన్‌ ప్యాషన్‌ డిజైనర్‌ రోహ్మన్‌ షాల్‌తో సహజీవనం చేస్తుందనే వార్తలు కొంతకాలంగా బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రోహ్మన్‌ షాల్‌


బాలీవుడ్‌ నటి, మాజీ మిస్‌ వరల్డ్‌ సుస్మితసేన్‌ ప్యాషన్‌ డిజైనర్‌ రోహ్మన్‌ షాల్‌తో సహజీవనం చేస్తుందనే వార్తలు కొంతకాలంగా బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! వీరిద్దరితోపాటు సుస్మిత పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఇటీవల రోహ్మన్‌ సుస్మిత పరిచయం, పెళ్లి ఆలోచన గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ‘‘నేను ముంబై వచ్చిన రెండేళ్లకు సుస్మిత పరిచయమైంది. అప్పటి వరకూ నా లైఫ్‌ వేరు. ఆమెతో పరిచయం ఏర్పడ్డాక నా జీవితంలో ప్రతి విషయం మారిపోయింది.  ఆడియన్స్‌కు స్టార్‌ల జీవితం గురించి ఒక అవగాహన ఉంటుంది. కానీ వారితో మనం ఓసారి కలిసుంటే వారి వెనకున్న కష్టం అర్థం అవుతుంది. మేమంతా సాధారణ ఫ్యామిలీగా ఉంటాం. ‘పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అన్న ప్రశ్న మా ఇద్దరి మధ్య తలెత్తదు. పెళ్లి ఎప్పుడు అనేది మేం దాచిపెట్టము. దానిని కాలమే నిర్ణయిస్తుంది. దాని గురించి భవిష్యత్తులో ఆలోచిస్తాం. ప్రస్తుతం సుస్మిత చేస్తున్న వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌ని ఆస్వాదిస్తున్నాం. తన రాకతో నేను జీవితాన్ని సీరియస్‌గా తీసుకున్నా. ఇతరులను గౌరవించడం మొదలు పెట్టా.  మోడలింగ్‌ ప్రారంభించినప్పుడు వేర్వేరు ప్లాన్‌లతో ఉండేవాడిని. ఒక స్టార్‌గా ఎదగాలనుకున్నా. కానీ ఇప్పుడు మోడలింగ్‌ నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. ఫేమస్‌ అవ్వాలనే ఆలోచన ఇప్పుడు నాలో లేదు’’ అని తెలిపారు.

Updated Date - 2021-02-07T06:18:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising