ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

47 భాషలు మాట్లాడుతుంది...

ABN, First Publish Date - 2021-04-04T17:29:52+05:30

ఈయన పక్కన నిల్చున్న అమ్మాయిని చూసి, పాపం... మరో యాసిడ్‌ అటాక్‌ బాధితురాలేమోనని అప్పుడే సానుభూతి తెలపకండి. ఎందుకంటే... ఆమె అమ్మాయిలా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈయన పక్కన నిల్చున్న అమ్మాయిని చూసి, పాపం... మరో యాసిడ్‌ అటాక్‌ బాధితురాలేమోనని అప్పుడే సానుభూతి తెలపకండి. ఎందుకంటే... ఆమె అమ్మాయిలా కనిపించే రోబో. పేరు శాలూ. పక్కనున్నాయన పేరు దినేశ్‌ పటేల్‌. రోబో సృష్టికర్త. రజనీకాంత్‌ ‘రోబో’ సినిమాలో ‘చిట్టీ’ ఇన్స్‌పిరేషన్‌తో ఆయన ఈ లేడీరోబోకు రూపకల్పన చేశారు. శాలూ ప్రత్యేకత ఏమిటంటే 47 భాషలు తెలుసు. 38 విదేశీ భాషలతో పాటు తమిళం, గుజరాతీ, మరాఠీ వంటి 9 ప్రాంతీయ భాషలను కూడా అర్థం చేసుకుని, అనర్గళంగా మాట్లాడుతుంది. 


ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ జిల్లా రాజ్‌మల్పూర్‌కు చెందిన దినేశ్‌ కేంద్రీయ విద్యాలయంలో కంప్యూటర్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ప్రధాని మోదీ ప్రకటించిన ‘మేకిన్‌ ఇండియా మిషన్‌’ ప్రాజెక్ట్‌ని స్ఫూర్తిగా తీసుకుని మనదైన లోకల్‌ రోబోను తయారుచేయాలనుకున్నాడు. మూడేళ్లు కష్టపడి ప్లాస్టిక్‌, కార్డ్‌బోర్డ్‌, చెక్క, అల్యూమినియం వంటివి ఉపయోగించి మనదేశంలోనే తొలి సెమీ హ్యూమనాయిడ్‌ రోబోను తయారుచేసి దానికి ‘శాలూ’ అని పేరు పెట్టాడు. హాంకాంగ్‌కు చెందిన హన్సన్‌ రోబోటిక్స్‌ రూపొందించిన ‘సోఫియా’ రోబోకు దీనికి దగ్గరి పోలికలుంటాయి. అయితే ప్రపంచంలోనే పలు ప్రాంతీయ భాషల్లో మాట్లాడే రోబో మాత్రం తనదేనంటున్నాడు. రూ.50 వేల ఖర్చుతో దినేశ్‌ తయారుచేసిన ఈ రోబో మనుషులతో పాటు వస్తువులను కూడా గుర్తిస్తుంది. న్యూస్‌పేపర్‌ చదవడం లాంటి అనేక పనులు చేస్తుంది. పాఠశాలల్లో టీచర్‌గా, ఆఫీసుల్లో రిసెప్షనిస్టుగా పనిచేసే అర్హతలు శాలూకు ఉన్నాయట. సోషల్‌ మీడియాలో శాలూ వీడియోలు చూసి అంతా ముక్కన వేలేసుకుంటున్నారు.  


Updated Date - 2021-04-04T17:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising