ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సాంగ్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’

ABN, First Publish Date - 2021-07-21T05:50:21+05:30

సరోద్‌ వాయిద్యంలో మాస్టర్‌ సౌమిక్‌ దత్తా. అంతేకాదు... కంపోజర్‌గా, ప్రొడ్యూసర్‌గా, బ్యాండ్‌ లీడర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోద్‌ వాయిద్యంలో మాస్టర్‌ సౌమిక్‌ దత్తా. అంతేకాదు... కంపోజర్‌గా, ప్రొడ్యూసర్‌గా, బ్యాండ్‌ లీడర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా అతడు రూపొందించిన ‘సాంగ్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ‘బ్రిటిష్‌ కౌన్సిల్‌’ కమిషన్‌ ఫర్‌ క్లైమేట్‌ చేంజ్‌ అవార్డు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మొత్తం 480 మందిలో 17 మందిని అవార్డులు వరించాయి. వారిలో సౌమిక్‌ ఒకడు. ఇక నవంబర్‌లో జరగనున్న 26వ ‘క్లైమేట్‌ చేంజ్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ది పార్టీస్‌’ (కాప్‌26)లో ఈ యానిమేటెడ్‌ మ్యూజిక్‌ ప్రాజెక్ట్‌ని ప్రదర్శించనున్నారు. ‘కాప్‌26’కి గ్లాస్గో ఆతిథ్యం ఇవ్వనుంది. ముంబయిలో పుట్టిన సౌమిక్‌ ప్రస్తుతం లండన్‌లో స్థిరపడ్డాడు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ, ప్రకృతిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలనే సందేశాన్నిస్తూ సాగుతుంది అతడి ‘సాంగ్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’. ఇదే నేపథ్యంలో గతంలో కూడా ‘జంగల్‌’ పేరుతో ఓ ఆల్బమ్‌ను వదిలాడు. దానికీ మంచి గుర్తింపు వచ్చింది. ‘ప్రకృతే నాకు స్ఫూర్తి. 


కలలను నెరవేర్చుకొనే దిశగా ఆ ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు చెబుతుంది’ అంటున్న సౌమిక్‌ ‘కాప్‌26’కు తన ప్రాజెక్ట్‌ను ఆహ్వానించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పుడే కాదు... తన సంగీతంలో ఎప్పుడూ సామాజిక కోణాన్ని జోడిస్తాడు అతడు. ప్రతిఒక్కరూ పర్యావరణ హితం కోసం పాటుపడే కార్యకర్తలు కావాలని పిలుపునిస్తాడు. కరోనా సమయంలో మరికొంత మంది మ్యుజీషియన్లతో కలిసి ‘సైలెంట్‌ స్పేసెస్‌’ రూపొందించాడు. లాక్‌డౌన్ల పరంపరంలో ఖాళీగా ఉన్న కళా వేదికల అంతరంగాన్ని ఆవిష్కరించే ఆల్బమ్‌ ఇది. ‘ఫ్రెట్‌లెస్‌, సర్కిల్‌ ఆఫ్‌ సౌండ్‌, యాంటీ హీరో, కింగ్‌ ఆఫ్‌ ఘోస్ట్స్‌’ సౌమిక్‌ ఇతర ఆల్బమ్స్‌. ‘సౌమిక్‌ దత్తా ఆర్స్ట్‌’ (ఎస్‌డీఏ)కు సహవ్యవస్థాపకుడు. ఇతర కళాకారులతో కలిసి సృజనాత్మక ప్రాజెక్ట్‌లు చేసే ఉద్దేశంతో ‘ఎస్‌డీఏ’ని నెలకొల్పాడు.

Updated Date - 2021-07-21T05:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising