ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాహం తీరట్లేదా?

ABN, First Publish Date - 2021-03-30T05:41:12+05:30

శీతల పానీయాలు దాహార్తిని పెంచుతాయి. చల్లనీళ్లు దాహార్తిని పూర్తిగా తీర్చలేవు. అలాంటప్పుడు తాజా పండ్లరసాలతో దాహార్తిని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. పుచ్చ, తర్బూజా, నారింజ, బత్తాయి రసాలు ఎక్కువగా తాగాలి. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శీతల పానీయాలు దాహార్తిని పెంచుతాయి. చల్లనీళ్లు దాహార్తిని పూర్తిగా తీర్చలేవు. అలాంటప్పుడు తాజా పండ్లరసాలతో దాహార్తిని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. పుచ్చ, తర్బూజా, నారింజ, బత్తాయి రసాలు ఎక్కువగా తాగాలి. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడతాయి. అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సబ్జా నీళ్లు కూడా తరచుగా తాగడం ద్వారా ఎండ వేడిమి నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే తీయదనం కోసం పళ్లరసాల్లో చక్కెర కలపకూడదు. పండ్ల రసాలు ఎక్కువ మొత్తాలో తయారుచేసుకుని, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తాగడమూ సరికాదు. ఎప్పటికప్పుడు తాజాగా పండ్ల రసాలను తయారుచేసుకుని తాగాలి. చల్లదనం కోసం ఒకటి రెండు ఐస్‌ క్యూబ్స్‌ వేసుకోవచ్చు. అలాగే ఘనపదార్థాలు ఈ కాలంలో పరిమితంగానే తీసుకోవాలి. వేసవిలో జీర్ణవ్యవస్థ పనితీరు కొంతమేరకు కుంటుపడుతుంది. కాబట్టి తక్కువ మొత్తాల్లో ఆహారపదార్థాలను ఎక్కువ సార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. బీర, సొర, పొట్ల, దోస లాంటి నీరు ఉండే కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వంటకాలను రోజుల తరబడి నిల్వ ఉంచి, తినకుండా ఎప్పటికప్పుడు వండుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు తగ్గించి తినాలి.

Updated Date - 2021-03-30T05:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising